Rocket Stock: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా కంపెనీలు తమ క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. దీంతో కొన్ని కంపెనీల షేర్లు ఊహించని విధంగా లాభపడుతున్నాయి.
తాజాగా ఈరోజు మార్కెట్ ఇంట్రాడే ట్రేడ్‌లో దిసా ఇండియా షేర్లు BSEలో 20% ఎగువ సర్క్యూట్ తాకి భారీగా లాభపడ్డాయి. కంపెనీ షేర్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.14,770.70కి చేరుకున్నాయి. అంటే బుధవారం నాటి ముగింపు ధర రూ.12,308.95తో పోలిస్తే షేర్ ధర రూ.2,461.75 పెరిగింది. జూన్ త్రైమాసిక ఫలితాల తర్వాత కంపెనీ షేర్లలో ఈ పెరుగుదల నమోదైంది.

పారిశ్రామిక ఉత్పత్తుల వ్యాపారంలో నిమగ్నమైన కంపెనీ Q1FY23లో రూ.7.53 కోట్ల నికర లాభాన్ని పోస్ట్ చేసింది. కానీ ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో నికర లాభం రెండింతలు పెరిగి రూ.15.58 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.64.19 కోట్లుగా ఉండగా.. FY24 జూన్ త్రైమాసికంలో 41 శాతం పెరిగి రూ.90.69 కోట్లకు చేరుకుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కంపెనీ షేరు ధర 86 శాతం పెరిగింది. ఇదే కాలంలో S&PBSE సెన్సెక్స్ దాదాపు 12 శాతం లాభపడింది. కంపెనీ DISA బ్రాండ్ మోల్డింగ్ మెషీన్‌లు, వీల్‌బ్రేటర్ బ్రాండ్ షాట్ బ్లాస్టింగ్ మెషీన్‌లు.. ఇతర పర్యావరణ నియంత్రణ పరికరాల తయారీ, విక్రయాల వ్యాపారంలో నిమగ్నమై ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications