Direct Tax: అంతర్జాతీయ ఆర్థిక అనిస్థితిని తలదన్నుతూ భారత ఆర్థిక రంగం దూసుకుపోతోంది. GSTతో పాటు కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయం తరహా ప్రత్యక్ష పన్నల వసూళ్లు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. దీనికి కారణం ఎప్పటికప్పుడు కేంద్రం తీసుకుంటున్న పన్ను ఎగవేత కట్టడి చర్యలే అని చెప్పవచ్చు. తద్వారా రెండంకెల మేర వృద్ధి నమోదు చేస్తూ ఇండియా ముందుకు సాగుతోంది.

రెండంకెల వృద్ధితో రంకెలు
ప్రత్యక్ష పన్నుల ద్వారా మార్చి 10 నాటికి ప్రభుత్వానికి రూ. 16.68 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 22.6 శాతం వృద్ధి నమోదు అయినట్లు పేర్కొంది. కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో మంచి ప్రగతి కనపడినట్లు వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే.. ఆర్థిక కార్యకలాపాలలో సంస్థాగత అభివృద్ధి ఊపందుకున్నట్లు అర్థమవుతోందని అభిప్రాయపడింది.

బడ్జెట్ అంచనా అందుకునేంతగా..
రిఫండ్ చేయాల్సిన మొత్తం పెరిగినప్పటికీ, ఆదాయంలోనూ అదే స్థాయిలో వృద్ధి కనిపించినట్లు ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది. 1 ఏప్రిల్, 2022-10 మార్చి, 2023 మధ్య రూ.2.95 లక్షల కోట్లను రిఫండ్ గా చెల్లించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 60 శాతం ఎక్కువ కావడం గమనార్హం. నెట్ వసూళ్లు రూ.13.73 లక్షల కోట్ల మేర నమోదు కాగా.. బడ్జెట్ అంచనాలో 96.67 శాతం, రివైజ్ అంచనాలో 83.19 శాతాన్ని అందుకున్నట్లు ప్రకటించింది.

వచ్చే ఏడాది అంచనాలు పైపైకి:
మొదటగా రూ.14.20 లక్షల కోట్లుగా అంచనా వేసిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లను ఆర్థిక శాఖ అంచనా వేసింది. అయితే ఆర్థిక కార్యకలాపాలు మంచి వేగంతో తిరుగి పుంజుకుంటూ ఉండటంతో.. వాటిని రూ.16.50 కోట్లకు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ ఆదాయపుపన్ను రూ.7.20 లక్షల కోట్లు కాగా వ్యక్తిగత ఆదాయపుపన్ను రూ.7 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది.
సవరించిన అంచనాల ప్రకారం కార్పొరేట్ ఆదాయాన్ని రూ.8.35, వ్యక్తిగత ఆదాయాన్ని రూ.8.15 లక్షల కోట్లకు పెంచింది. అయితే వచ్చే ఏడాదికి ఈ మొత్తాన్ని వరుసగా రూ.9.23, రూ.9 లక్షల కోట్లుగా అంచనా వేసింది.


Click it and Unblock the Notifications