Direct Tax Collection: భారత్‌లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాది కంటే 17.7 శాతం పెరిగి రూ.19.58 కోట్లకు చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇది ఆశించిన మొత్తం కంటే ఎక్కువని పన్ను శాఖ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
2023-2024 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ, కార్పొరేట్ సంస్థల ద్వారా సేకరించిన మొత్తం 7.40 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో వ్యక్తిగత ఆదాయంపై పన్నులు, కార్పొరేట్ పన్నులతో కలిపి మొత్తం టాక్స్ కలెక్షన్ 18.48 శాతం పెరిగి రూ.23.37 లక్షల కోట్లకు చేరుకుంది. రీఫండ్‌లను లెక్కించిన తర్వాత పన్నుల నికర ఆదాయం 17.7 శాతం పెరిగి రూ.19.58 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వసూళ్లలో పెరుగుదల కంపెనీల ఆర్థిక పురోగతితో పాటు వ్యక్తుల విషయంలో పెరిగిన ఆదాయాల స్థాయిని సూచిస్తోంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3.79 లక్షల కోట్ల మొత్తం రీఫండ్ రూపంలో చెల్లించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ స్పష్టం చేసింది. బోర్డ్ ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష నికర వసూళ్లు రూ.19.58 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23లో ఇది రూ.16.64 లక్షల కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను మొదట రూ.18.23 లక్షల కోట్లుగా అంచనా వేయగా.. ఆ తర్వాత రూ. 19.45 లక్షల కోట్లకు సవరించారు.
2023-2024 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల మొత్తం వసూళ్లు రూ.23.37 లక్షల కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23లో వచ్చిన మొత్తం రూ.19.72 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 18.48 శాతం అధికం. ఇదే క్రమంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు గత ఏడాది రూ.10 లక్షల కోట్ల నుంచి 13.06 శాతం పెరిగి రూ.11.32 లక్షల కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.9.11 లక్షల కోట్లు. ఇది గత ఏడాది రూ.8.26 లక్షల కోట్లతో పోలిస్తే 10.26 శాతం వృద్ధిని సూచిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(STT)తో సహా మొత్తం వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.12.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications