Flight News: GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం యూరోపియన్ దేశాలకు మరింత చేరువ కానుంది. ఇందుకోసం జనవరి 16, 2024 నుంచి నేరుగా విమానాల సర్వీసులను నడిపేందుకు అడుగు ముందుకేసింది.
ఇందుకోసం ప్రధాన యూరోపియన్ స్టార్ అలయన్స్ మెంబర్ ఎయిర్‌లైన్ అయిన లుఫ్తాన్సా హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు నాన్‌స్టాప్ డైరెక్ట్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఫ్రాంక్‌ఫర్ట్-హైదరాబాద్‌కు లుఫ్తాన్స తొలి డైరెక్ట్ ఫ్లైట్ గా వైడ్ బాడీ బోయింగ్ B787-9 డ్రీమ్‌లైనర్‌తో ప్రారంభం కానుంది. ఇందులో 26 బిజినెస్ క్లాస్, 21 ప్రీమియం ఎకానమీ, 247 ఎకానమీ క్లాస్ సీట్లు విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

ఎనిమిదిన్నర గంటల ప్రయాణ సమయం కలిగిన ఈ విమానం ఫ్రాంక్‌ఫర్ట్ - హైదరాబాద్ విమానాశ్రయాల మధ్య వారానికి మూడుసార్లు నడవనుంది. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు మంగళ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో సోమ, బుధ, శనివారాల్లో హైదరాబాద్ నుంచి ఉంటుందని ఫ్లైట్ షెడ్యూల్ చెబుతోంది.
ఈ కొత్త ఫ్లైట్ రూట్ తెలంగాణతో పాటు సమీప పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను యూరప్‌లోని అనేక నగరాలు, దేశాలు, ప్రాంతాలతో కనెక్ట్ చేస్తుంది. ప్రపంచంలోని ప్రధాన విమానయాన కేంద్రంగా ఉన్న ఫ్రాంక్‌ఫర్ట్ ప్రయాణికులను USA, కెనడాతో సహా ఉత్తర అమెరికాలోని అనేక నగరాలకు కనెక్ట్ చేస్తుంది. దీనికి తోడు లుఫ్తాన్స ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి లాటిన్ అమెరికాలోని అనేక నగరాలకు అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది. కాబట్టి మీ ప్రయాణాన్ని ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications