For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ చైర్మన్‌గా దినేశ్ కుమార్ ఖారా..? ప్రధాని ఆమోదమే తరువాయి..

|

దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్‌గా దినేష్ కుమార్ ఖారా నియమితం అవనున్నారు. బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) దినేశ్ పేరును సిఫారసు చేసింది. నామినేషన్‌ను ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ నియామకాల కమిటీ ముందు ఉంచతారు. కమిటీ ఆమోదంతో ఖారా ఎస్బీఐ చైర్మన్ బాధ్యతలను చేపడతారు.

ప్రస్తుత ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పదవీకాలం ఈ అక్టోబర్ 7తో ముగియనుంది. ఈ క్రమంలో కొత్త చైర్మన్ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది. ఎస్బీఐ నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లను శుక్రవారం ఇంటర్వ్యూ చేశారు. తర్వాత ఖారా పేరును తదుపరి ఛైర్మన్ గా సిఫార్సు చేసినట్టు బీబీబీ తెలిపింది. మరో ఎండీ చల్లా శ్రీనివాసుల శెట్టి పేరును రిజర్వ్‌ క్యాండిడేట్‌గా ప్రతిపాదించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రజనీశ్‌ పదవీకాలాన్ని పొడిగించలేరనే ప్రచారం జరిగింది. కానీ బీబీబీ సిఫారసుతో ఆ ఊహాగానాలకు తెరపడింది.

dinesh kumar khara will be next sbi chairman..

ఢిల్లీలోని ఎఫ్ఎమ్ఎస్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఖారా మాస్టర్స్ చేశారు. 1984లో ఎస్బీఐ ప్రొబేషనరీ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ సబ్సిడియరీస్ విభాగానికి ఖారా ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకు, ఐదు బ్యాంకుల విలీనంలో ఖారా ముఖ్య భూమిక పోషించారు.

English summary

ఎస్బీఐ చైర్మన్‌గా దినేశ్ కుమార్ ఖారా..? ప్రధాని ఆమోదమే తరువాయి.. | dinesh kumar khara will be next sbi chairman..

next sbi chairman will be dinesh kumar khara. banks board bureau recommend his name to cabinet committee.
Story first published: Saturday, August 29, 2020, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X