IPO News: 90 శాతం లాభంతో ఐపీవో లిస్టింగ్.. కొనుగోలుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్స్..
Dindigul Farm IPO: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం మెగా బుల్ ర్యాలీని చూస్తున్నాయి. కీలక బెంచ్ మార్క్ సూచీలు నాలుగో రోజు సైతం సరికొత్త రికార్డు జీవితకాల గరిష్ఠాలను తాకటంతో పాటు మార్కెట్లో లిస్ట్ అవుతున్న ఐపీవోలు ఇన్వెస్టర్లకు డబ్బు వర్షం కురిపిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దిండిగల్ ఫార్మ్ ప్రొడక్ట్స్ కంపెనీ ఐపీవో గురించే. బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో నేడు కంపెనీ షేర్లు అద్భుతమైన లిస్టింగ్ నమోదు చేశాయి. కంపెనీ షేర్లు 90 శాతం ప్రీమియం ధర రూ.102.60 వద్ద మార్కెట్లో జాబితా అయ్యాయి. అయితే ఇష్యూ సమయంలో కంపెనీ ఒక్కో షేరును దరఖాస్తుదారులకు కేవలం రూ.54కి విక్రయించింది. లిస్టింగ్ తర్వాత కొనుగోలుదారుల నుంచి వచ్చిన డిమాండ్ తో షేర్ల ధర మరో 10 శాతం పెరిగి ఇంట్రాడేలో రూ.107.73కి చేరాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను గమనిస్తే రూ.51-54గా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవో జూన్ 20 నుంచి 24 వరకు తెరచి ఉంది.

దిండిగల్ ఫార్మ్స్ ఐపీవోకు బీలైన్ క్యాపిటల్ అడ్వైజర్స్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించింది. అలాగే లింక్ ఇన్‌టైమ్ ఇండియా ఐపీవోకి మార్కెట్ మేకర్‌గా రిజిస్ట్రార్‌గా వ్యవహరించింది. 2010లో ఏర్పాటైన దిండిగల్ ఫార్మ్స్ సంస్థ.. ప్రధానంగా హోల్ మిల్క్ అండ్ స్కిమ్డ్ మిల్క్‌ను ప్రాసెస్ చేసి, మిల్క్ ప్రొటీన్ కాన్సంట్రేట్‌లు, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, డైరీ వైట్‌నర్, వెయ్ ప్రొటీన్ కాన్సంట్రేట్, మిల్క్ వెయ్ పౌడర్, కేసైన్, అన్‌బ్రాండెడ్ క్రీమ్, వెన్న, చిన్న పిల్లలకు పాలపొడులతో సహా వివిధ డైరీ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. శిశు పాల ఫార్ములా కోసం నింపిన పొడులు. కంపెనీ తన వ్యాపారాన్ని దేశంలో 15 రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయంగా 3 దేశాల్లో విక్రయిస్తోంది.
కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.34.83 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో కంపెనీ ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా నిర్ణయించింది. దీని ప్రకారం ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ కంపెనీ ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం ఇందుకోసం రూ.1.08 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ క్రమంలో కంపెనీ 64.5 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. తాజా ఐపీవో నుంచి వచ్చిన మెుత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, క్యాపిటల్ వ్యయాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.


Click it and Unblock the Notifications