e-rupee: భారత డిజిటల్ కరెన్సీ e-రూపాయిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు RBI వడివడిగా అడుగులు వేస్తోంది. కంగారు లేకుండా నెమ్మదిగా జనంలోకి పంపిస్తామని చెబుతున్నా, కేంద్ర బ్యాంకు దూకుడు ప్రదర్శిస్తోంది. మొదట 8 బ్యాంకులతో 5 నగరాల్లో ప్రారంభించిన ఈ సేవలను, మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని నగరాల్లో e-రూపాయి:
డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులో కొత్తగా మరో 5 బ్యాంకులు భాగం కానున్నట్లు రిజర్వ్ బ్యాంకు బుధవారం తెలిపింది. రిటైల్ కస్టమర్ల కోసం e-రూపాయిని ఈ బ్యాంకుల ద్వారా అందించనున్నట్లు పేర్కొంది. మరిన్ని బ్యాంకులు చేరడంతో.. ఈ ప్రాజెక్ట్ 9 నగరాలకు విస్తరించబడుతున్నట్లు వెల్లడించింది. తొందరపడకుండా నెమ్మదిగా, స్థిరంగా డిజిటల్ కరెన్సీని ప్రజలకు అలవాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పింది.

అవాంతరాలేమీ లేవు:
8 బ్యాంకుల ద్వారా 5 నగరాల్లో e-రూపాయి వినియోగాన్ని డిసెంబర్ ప్రారంభంలో రిజర్వ్ బ్యాంకు మొదలుపెట్టింది. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ(CBDC) ప్రస్తుతం 50 వేల మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వారిలో 5 వేల మంది వ్యాపారులు. 5 నగరాల్లోని 8 బ్యాంకులు ప్రస్తుతం ఈ సేవలను అందిస్తున్నాయని డిప్యూటీ గవర్నర్ రబి శంకర్ తెలిపారు. "ఇప్పటివరకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాలేదు. అందువల్ల ప్రస్తుత పైలట్ సేవలను మరిన్ని ఇతర నగరాలకూ విస్తరించనున్నాం. అందుకే బ్యాంకులను సైతం 5 నుంచి 9కి పెంచాం" అని వెల్లడించారు.

తొందరేమీ లేదు:
"ప్రజలు డిజిటల్ కరెన్సీకి మారే ప్రక్రియ క్రమంగా, నెమ్మదిగా జరగాలని కోరుకుంటున్నాము. త్వరితగతిన పూర్తి చేయాలని ఏమీ తొందరపడటం లేదు. వినియోగదారులు, వ్యాపారులు పరంగా మాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటి ఆధారంగా నెమ్మదిగా e-రూపాయిని ప్రజల్లోకి తీసుకువెళ్తాము. పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో వాస్తవికంగా అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం" అని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. లావాదేవీల పరంగా చూస్తే ఇప్పటివరకు కేవలం రూ.7.7 లక్షల విలువైన ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగాయని చెప్పారు.

టోకు, రిటైల్ వినియోగానికి..
గతేడాది నవంబర్ 1, డిసెంబర్ 1న డిజిటల్ కరెన్సీని టోకు, రిటైల్ వినియోగం కోసం RBI ప్రారంభించింది. హోల్‌సేల్ CBDC వినియోగాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు, సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్‌మెంట్ కు పరిమితం చేశారు. రిటైల్ ఇ-రూపాయిని మాత్రం వినియోగదారులు, వ్యాపారుల మధ్య కొనుగోళ్ల కోసం క్లోజ్డ్ యూజర్ గ్రూప్(CUG)గా పైలట్ చేస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications