PhonePe News: లోన్స్ వ్యాపారంలోకి ఫోన్ పే.. త్వరలో NBFC లైసెన్స్ కోసం దరఖాస్తు..

PhonePe News: డిజిటల్ చెల్లింపుల రంగంలో సంచలనాలు సృష్టించిన ఫోన్ పే దానిని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తోంది. ఇప్పటికే యూపీఐ పేమెంట్స్ మార్కెట్లో గుర్తింపు పొందిన సంస్థ షాపింగ్ యాప్‌ను ప్రారంభించింది. ఇది చాలదన్నట్లు దేశీయ రుణాల వ్యాపార మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు అడుగులు వేస్తోంది.

వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా కొత్త-క్రెడిట్ మోడల్‌లను పరీక్షించడానికి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు సీఈవో వెల్లడించారు. డిజిటల్ లెండింగ్ విభాగంలో కంపెనీ రానున్న కాలంలో ప్రత్యర్థి పేటీఎంకు పోటీదారుగా నిలిచేందుకు ఈ నిర్ణయం దోహదబడనుంది. దీనికి ముందు కంపెనీ పిన్‌కోడ్ పేరుతో ఈ-కామర్స్ ఆటను ప్రారంభించింది.

Digital payments startup PhonePe looking to enter lending business may apply for NBFC licence

దేశంలోని డిజిటల్ లెండింగ్ విభాగంలో అనేక మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ.. డిమాండ్ సైతం అదే స్థాయిలో అత్యధికంగా ఉందని కంపెనీ గుర్తించింది. డిజిటల్ రుణాల వ్యాపార ప్రయత్నాల కోసం కంపెనీ ఏడాది ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. దేశంలో అత్యుత్తమ ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీగా కొనసాగుతున్న ఫోన్ పే ప్రస్తుతం 12 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిజిటల్ చెల్లింపు సంస్థలు పేటీఎం, భారత్ పే వంటివి ఇప్పటికే కస్టమర్లకు రుణాలను అందిస్తూ వ్యాపారంలో ముందంజలో ఉన్నాయి. పైగా వీటి నుంచి భారీగా అదాయాన్ని పొందుతున్నాయి. అయితే ఇన్నాళ్లుగా ఈ విభాగంలో ఫోన్ పే అడుగుపెట్టకుండా దూరంగా ఉంది. లాభాల బాటలో ప్రయాణించాలని నిర్ణయించిన కంపెనీ రుణ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ZestMoneyని కొనుగోలు చేసే ఆలోచనపై కసరత్తు చేస్తోంది. జెస్ట్ మనీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బై నౌ పే లేటర్ విభాగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

PhonePe డిజిటల్ చెల్లింపుల సంస్థను 2015లో సమీర్ నిగమ్, రాహుల్ చారి, బుర్జిన్ స్థాపించారు. 2017లో ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చి బిల్లు చెల్లిపులు, యుటిలిటీ చెల్లింపులు, బంగారంలో పెట్టుబడులు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు వంటి ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం సంస్థ తన ఫ్లాట్ ఫారమ్‌పై 40 కోట్ల మంది నమోదిత వినియోగదారులకు కలిగి ఉంది. యూపీఐ చెల్లింపుల్లో మార్కెట్ లీడర్ గా కొనసాగుతున్న కంపెనీ ఈ విభాగంలో 47 శాతం వాటాను కలిగి ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+