Googleని 'ఢీ' కొట్టడానికి సిద్ధమౌతున్న PhonePe.. ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకే..!
PhonePe News: డిజిటల్ పేమెంట్స్ వ్యాపారంలో దిగ్గజ సంస్థగా దేశంలో ఫోన్ పే ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్వరగా లాభదాయకమైన కంపెనీగా మారేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీ వేగంగా ఇతర వ్యాపార ఆలోచనలను రంగంలోకి దించుతోంది.
ఈ క్రమంలో ఫిన్‌టెక్ దిగ్గజం PhonePe దేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక అప్లికేషన్ స్టోర్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఉంది. ఆసియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారదేశంలో మొబైల్ చెల్లింపుల పరిశ్రమను శాసిస్తున్న వాల్‌మార్ట్ మద్దతుగల సంస్థ ఫోన్ పే నుంచి వస్తున్న కొత్త ఉత్పత్తి ఇది కావటం గమనార్హం.

ప్రస్తుతం యాప్ స్టోర్ వ్యాపారంలో గూగుల్ కింగ్‌గా కొనసాగుతోంది. అయితే స్థానిక డెవలపర్లకు సహాయం చేస్తూ.. వినియోగదారులు మెచ్చే అధిక నాణ్యమైన సేవలను అందించటం లక్ష్యంగా అనేక భాషల్లో పరిష్కారాలు అందించే విధంగా దీనిని తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల కంపెనీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ IndusOSను కొనుగోలు చేసిన తర్వాత యాప్ స్టోర్‌ల మార్కెట్‌లోకి ఫోన్ పే ప్రవేశించాలని చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలతో భాగస్వామ్యాలను సృష్టించుకుని కస్టమర్లకు చేరువకాలాలని చూస్తోంది. PhonePe కూడా భారతదేశంలో యాప్ స్టోర్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఉన్నట్లు ధృవీకరించింది. ప్రస్తుతం యాప్ స్టోర్ మార్కెట్‌లో 97 శాతం భారతీయ వినియోగదారులను Google ఆదేశిస్తున్నట్లు ఫోన్ పే అధికారిక ప్రతినిధి టెక్ క్రంచ్‌కి తెలిపారు. ప్రస్తుతం తమకు 450 మిలియన్ల యూజర్లు ఉన్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications