Digital I Day offers, Sale: HDFC కార్డతో రూ.3,000 వరకు డిస్కౌంట్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనుబంధ రిలయన్స్ డిజిటల్.. డిజిటల్ ఇండియా సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరిన్ని ఆఫర్లను ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌తో పాటు కంపెనీ పోర్టల్‌లో చేసే కొనుగోళ్లకు కూడా ఇవి వర్తిస్తాయని వెల్లడించింది. ఆగస్ట్ 16వ తేదీ వరకు HDFC బ్యాంకు కార్డ్స్, EMI ట్రాన్సాక్షన్స్ పైన 10 శాతం రాయితీని పొందవచ్చును. రాయితీ రూ.3000 వరకు ఉంటుంది. రూ.9999 కనీస ట్రాన్సాక్షన్ పైన రూ.500 వ్యాలెట్ క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ద్వారా ఆగస్ట్ 31వ తేదీ వరకు పొందవచ్చు. జస్ట్ మనీ ద్వారా చేసే రూ.10,000కు పైగా కొనుగోళు పైన కస్టమర్లు నో కాస్ట్ ఈఎమ్‌ఐతో పాటు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. టీవీలు, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నట్లు తెలిపింది.

ప్రత్యేక ఆఫర్లు
టీవీలు, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్స్, గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు వర్తిస్తున్నాయి. కస్టమర్లు ఇన్‌స్టా డెలివరీ (మూడు గంటల్లోపు డెలివరీ) సౌలభ్యాన్ని కూడా పొందవచ్చునని తెలిపింది. అంతేకాదు, మీ సమీపంలోని స్టోర్ నుండి స్టోర్ పిక్-అప్ ఆప్షన్ కూడా ఉంది. అన్ని రిలయన్స్ స్టోర్స్ అలాగే డెలివరీ భాగస్వాములు కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది. కస్టమర్లు, ఉద్యోగుల సేఫ్టీ కోసం జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తున్నామని తెలిపింది.

వేలాది ఉత్పత్తులు
భారత్‌లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ రిటైలర్స్‌లో రిలయన్స్ డిజిటల్ ఒకటి. దేశంలోని 800 నగరాల్లో స్టోర్స్ ఉన్నాయి. ఇందులో 460కు పైగా అతిపెద్ద రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, 1800కు పైగా మైజియో స్టోర్స్ ఉన్నాయి. వీటిలో 300కు పైగా ఇంటర్నేషనల్, నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. 5000కు పైగా ఉత్పత్తులను బెస్ట్ ధరలకు అందిస్తున్నాయి. కస్టమర్ల రైట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కోసం రిలయన్స్ డిజిటెల్ ఎన్నో మోడల్స్ కలిగి ఉంది. అన్ని ఉత్పత్తుల పైన ఆఫ్టర్ సేల్ సేవలను కూడా అందిస్తోంది. రిలయన్స్ రెస్‌క్యూ ఈ సేవలు అందిస్తోంది. మరింత సమాచారం కోసం రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ను సందర్శించవచ్చును. లేదా www.reliancedigital.in కు లాగ్-ఇన్ కావడం ద్వారా తెలుసుకోవచ్చు.

ఇక్కడ కొన్ని ఆఫర్లు...
- మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే రూ.12,149 నుండి ఉన్నాయి. మీకు నచ్చిన, అందుబాటులోని నమూనాలను చూసి కొనుగోలు చేయవచ్చు.
- స్మార్ట్ వాచీల పైన 53 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. అన్ని బ్రాండ్స్, స్మార్ట్ వాచీల పైన ఆఫర్లు వర్తిస్తాయి.
- స్మార్ట్ ఫోన్లు రూ.3899 నుండి అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
- సౌండ్ బార్స్ రూ.1999 నుండి అందుబాటులో ఉన్నాయి.
- ల్యాప్‌టాప్స్ రూ.16900 నుండి అందుబాటులో ఉన్నాయి. డెల్, HP, లెనోవోతో పాటు ఇతర అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి.
- ఆడియో యాక్సెసరీస్ పైన 70 శాతం వరకు ఆఫర్లు వర్తిస్తాయి.
- ముఖ్యంగా HDFC కార్డ్ పైన మంచి క్యాష్ బ్యాక్ ఉంది. 10 శాతం లేదా రూ.3000 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది.
- కుకింగ్ ఎసెన్షియల్స్ లేదా ల్యాప్‌టాప్స్ పైన డిస్కౌంట్ ఉంటుంది. ఆపిల్ ఎయిర్ పోడ్స్ పైన రూ.2500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.
- మీ రూటర్ కోసం యూపీఎస్ తీసుకుంటే రూ.1490 డిస్కౌంట్ ఉంది.


Click it and Unblock the Notifications