Gold News: పెళ్లి నుంచి పేరంటం వరకు ఏ శుభకార్యమైనా, లేకుంటే పండుగైనా భారతీయులు బంగారం కొనటాన్ని శుభప్రదంగా భావిస్తుంటారు. చాలా మంది దీనిని మంచి పెట్టుబడి కేటగిరీ కింద భావిస్తున్నారు.
అయితే మార్కెట్లో రేటు కంటే చౌక ధరకు ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో పసిడిని విక్రయిస్తోంది. బయట దుకాణంలో కంటే డిజిటల్ రూపంలో కొని నిల్వచేయటం సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఉంది. అయితే ఇది గతంలో పెట్టుబడి పెట్టిన వారికి 100 శాతానికి పైగా రాబడి లభించింది. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ 15 వరకు చౌకగా డిజిటల్ గోల్డ్ కొనేందుకు ఉన్న అవకాశాన్ని పెట్టుబడిదారులు వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డిజిటల్ రూపంలో కొనుగోలు చేసే బంగారానికి ప్రభుత్వం ఒక సర్టిఫికెట్ అందిస్తుంది. అలాగే ఇలా పెట్టుబడి పెట్టిన వారు తమ బాండ్లపై 2.5 శాతం వడ్డీని కూడా పొందుతారు. అంటే విలువ పెరగటం వల్ల వచ్చే మూలధన రాబడికి ఇది అధనం. ప్రస్తుతం ట్రెంచ్ విక్రయానికి గ్రాము బంగారం రేటును రిజర్వు బ్యాంక్ రూ.5,923గా ఉంటుందని ప్రకటించింది. దీనికి ఏడేళ్ల పాటు లాక్ ఇన్ పిరియడ్ ఉంటుందని వెల్లడించింది. అలాగే చివరిగా పొందే లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కూడా వర్తిస్తుంది.
గడచిన ఏడేళ్లలో డిజిటల్ గోల్డ్ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు అత్యధికంగా 120 శాతం రాబడిని పొందారు. 2015లో ప్రారంభించినప్పటి నుంచి స్కీమ్ పెట్టుబడిదారుల అద్భుతమైన స్పందనను పొందుతూనే ఉంది. 2015-16లో స్కీమ్ కింద గ్రాము బంగారం ధర పెట్టుబడికి రూ.2,684గా ఉంది. ప్రస్తుతం 2023-24 రెండవ సిరీస్‌లో ఇష్యూ ధరను గమనిస్తే రూ.5,923గా కొనసాగుతోంది. అంటే గడచిన ఏడేళ్ల కాలంలో స్కీమ్ పెట్టుబడిదారులకు 120 శాతం రాబడితో డబ్బులను రెట్టింపు చేసింది.
ప్రస్తుత కాలంలో భౌతికంగా బంగారాన్ని కొని నిల్వ చేయటం పురాతన పద్ధతిగా మారిపోయింది. ఆభరణాలు కొనాలన్నా షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు ద్వారా ఇంటి వద్దకే వ్యాపారులు డెలివరీ చేస్తున్నారు. చాలా మంది పెట్టుబడి కోసం కూడా ఆభరణాలను కొంటుంటారు. దీనివల్ల భౌతిక కొనుగోళ్లు.. తరుగు, మేకింగ్ ఛార్జీలు వంటి అదనపు ఖర్చులు డిజిటల్ పెట్టుబడి కంటే నష్టాన్ని కలిగిస్తున్నాయి. అందుకే డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు సరైన పెట్టుబడి ఎంపికగా చెప్పుకోవట్టు.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications