Akshaya Tritiya: బడ్జెట్ భయం వద్దు.. కేవలం ₹100 తో అక్షయ తృతీయ అదృష్టాన్ని కొనేయండి!
అక్షయ తృతీయ(Akshaya tritiya) నాడు బంగారం లేదా ఆస్తి వంటివి కొనుగోలు చేయడం అనేది భారతీయులకు సెంటిమెంట్ గా ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు బంగారం అంటే కేవలం నగల దుకాణానికి వెళ్ళడమే కాదు. డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్‌లు (ETFs), సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBs) వంటి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ ఏడాది వీటిలో ఏది ఎంచుకోవాలి? మీ పెట్టుబడి లక్ష్యాలకు ఏది సరిపోతుంది? అనే పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
భారతీయులకు అక్షయ తృతియ (Akshaya Tritiya) నాడు బంగారం కొనడం అనేది ఒక సెంటిమెంట్. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో బంగారం కొనుగోలు పద్ధతులు మారిపోయాయి. భద్రత, లాభం , సులభంగా అమ్మే అవకాశం (Liquidity) ప్రాతిపదికన ఏది ఉత్తమమో ఇక్కడ విశ్లేషిద్దాం.

1. డిజిటల్ గోల్డ్ (Digital Gold): చిన్న మొత్తాల కోసం
మీరు మొదటిసారి బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లయితే , మీ దగ్గర తక్కువ డబ్బు ఉంటే, డిజిటల్ గోల్డ్ ఉత్తమ ఎంపిక. మొబైల్ యాప్స్ ద్వారా కేవలం రూ. 1 కే బంగారం కొనవచ్చు. స్టోరేజ్ , ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు ఉన్నప్పటికీ, ఇది చాలా సరళంగా ఉంటుంది.
2. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs): ట్రేడింగ్ చేసేవారికి
మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే, గోల్డ్ ఈటీఎఫ్‌లు మంచి ఎంపిక. వీటిని స్టాక్ మార్కెట్ పనివేళల్లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఇది ఫిజికల్ గోల్డ్ ధరతో సమానంగా ఉంటుంది , పారదర్శకత ఎక్కువగా ఉంటుంది. లిక్విడిటీ కోరుకునే వారికి ఇది సరైన మార్గం.
3. సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB):
దీర్ఘకాలిక లాభాల కోసం మీరు కనీసం 5 నుండి 8 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టగలిగితే, ఎస్‌జీబీ (SGB) కి మించినది మరొకటి లేదు. ఇందులో బంగారం ధర పెరగడంతో పాటు, ఏడాదికి 2.5% స్థిర వడ్డీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా, మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే లాభాలపై పన్ను (Capital Gains Tax) ఉండదు. ఇది అత్యంత సురక్షితమైన , లాభదాయకమైన మార్గం.
ధరల హెచ్చుతగ్గులు , ఎంట్రీ పాయింట్
ఈ ఏడాది బంగారం ధరలు రూ. 1,80,000 గరిష్ట స్థాయి నుండి రూ. 1,45,000 కి తగ్గి, ప్రస్తుతం రూ. 1,50,000 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇలాంటి కన్సోలిడేషన్ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అక్షయ తృతీయ నాడు ఒకేసారి భారీగా కాకుండా, సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.
మీ అవసరమే మీ ఎంపిక!
నగలు వేసుకోవాలనే కోరిక ఉంటే ఫిజికల్ గోల్డ్ కొనండి. కేవలం పెట్టుబడి , లాభం కోసమే అయితే ఎస్‌జీబీ లేదా ఈటీఎఫ్‌లను ఎంచుకోండి. ముఖ్యంగా ఈ అక్షయ తృతియ (Akshaya Tritiya) నాడు ఆఫర్ల మాయలో పడకుండా, మీ ఆర్థిక లక్ష్యాలకు (లిక్విడిటీ, టాక్స్ బెనిఫిట్, రిస్క్) ఏది సరిపోతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సరైన పద్ధతిలో చేసే పసిడి పెట్టుబడి మీ భవిష్యత్తుకు నిజమైన అక్షయ సంపద అవుతుంది.


Click it and Unblock the Notifications