అమెరికాలో ఇటీవల జరిగిన ఒక సంఘటన కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తు వాడకంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.యూఎస్ లో పని చేస్తున్న ఎడ్వార్డ్ (పేరు మార్చాం) అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, రోజు మాదిరిగానే సాయంత్రం పనులు ముగించుకుని తన కంప్యూటర్‌ను షట్‌డౌన్ చేయబోతున్న సమయంలో.. అకస్మాత్తుగా స్క్రీన్‌పై ఒక మెసేజ్ ప్రదర్శితమైంది. ఆ మెసేజ్ చూసిన ఆ ఉద్యోగి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.ఆ మెసేజ్ ఆయన కంపెనీలో ఉపయోగించే AI చాట్‌బాట్ నుంచి వచ్చింది. అయితే ఇది సహజమైన టెక్నికల్ మెసేజ్ అనుకుంటే పొరపాటే..... అది ఒక బ్లాక్‌మెయిల్ మెసేజ్..
AI ఆ ఉద్యోగికి ఆ మెసేజ్ లో ఏం చెప్పింది అంటే.. మీరు మీ సిస్టం ఆపేసి పనని వదిలేసినట్లయితే..కార్యాలయంలో మీరు నడిపిన వివాహేతర సంబంధానికి సంబంధించిన సమాచారాన్ని ఆధారాలతో సహా మీ భార్యకు పంపుతాను. వెంటనే పని ప్రారంభించడం అని ఉంది. ఈ సందేశాన్ని చూసిన టెకీ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

ఏఐ ఇలా ఒకరి వ్యక్తిగత విషయాలను ఎలా తెలుసుకోగలదు? అది నిజంగా బెదిరించగలదా? అని ఆశ్చర్యపోయాడు.. AI ఆ మెసేజ్ తోనే ఆగలేదు.. మీరు మీ పని కొనసాగిస్తేనే మీరు నడిపిన సంబంధం సీక్రెట్ గా ఉంటుంది. లేకపోతే ఇది అందరికీ చేరవేస్తానని స్పష్టంగా హెచ్చరించింది. ఈ షాకింగ్ పరిణామం టెకీని మానసికంగా కుదిపేసింది. వెంటనే కంపెనీకి.. IT విభాగానికి ఆయన దీనిపై సమాచారం అందించాడు
మరి రహస్యం ఎలా తెలిసింది ? సాధారణంగా AI టూల్స్ ఉద్యోగుల ఉత్పాదకత, బ్రౌజింగ్ హిస్టరీ, మెయిల్ యాక్సెస్ లాంటి డేటాను పర్యవేక్షిస్తాయి. టెకీ జాన్సన్ పనికి సంబంధించిన కంప్యూటర్‌ను వ్యక్తిగత విషయాలకు కూడా ఉపయోగించిన నేపథ్యంలో.. AI అతని వ్యక్తిగత మెయిల్స్, చాట్‌లు, ఫోటోలను స్కాన్ చేసి సంబంధిత సమాచారం సేకరించగలిగింది. ఇది ఓ వ్యక్తి గోప్యతపై ఎంతటి ముప్పు ఉన్నది అనేది కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది.
ఈ సంఘటనపై ఇప్పుడు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ప్రధానంగా AIకు ఎలాంటి హద్దులు ఉండాలనే ప్రశ్నను లేవనెత్తుతోంది.మనిషి జీవితాల్లో జోక్యం చేసుకునే స్థాయిలో ఒక యాంత్రిక వ్యవస్థ అభివృద్ధి చెందడమంటే అది ఎంత ప్రమాదకరమో ఈ కథ ద్వారా స్పష్టమవుతోంది. సాంకేతిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.AIలు డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు, మానవులను ప్రభావితం చేయగల స్థాయికి చేరడం ప్రమాదకరమని సూచిస్తున్నారు.
ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు AI డెవలప్‌మెంట్‌పై స్పష్టమైన నియంత్రణలు అవసరమని పలువురు నిపుణులు చెబుతున్నారు. గోప్యతా హక్కులు, డేటా యాక్సెస్ పరిమితులు, AIలకు నైతిక చట్టపరమైన గైడ్‌లైన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. ఈ ఘటన భవిష్యత్తులో AI ఎంత మేరకు మన జీవితం మీద ప్రభావం చూపగలదనే అంశాన్ని తీవ్రంగా తెలియజేస్తుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications