భారత్‌లో క్రిప్టో కరెన్సీ గురించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్వయంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకు వస్తుందని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్బీఐ, సొంత డిజిటల్ కరెన్సీ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక అడుగుకు సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్ నెల సమయానికి డిజిటల్ కరెన్సీ ట్రయల్స్ ప్రారంభించాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
దశలవారీగా కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ(CBDC)ని ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు ప్రారంభించిందని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇదో కొత్త విధానమైన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. భద్రత, భారత ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య విధానం, ద్రవ్యలభ్యత వంటి అంశాలపై డిజిటల్ కరెన్సీ ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశాలను అధ్యయనం చేయాలన్నారు.

నగదు వినియోగం క్షీణించడం, బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీపై ఆసక్తి పెరుగుతుండటంతో సెంట్రల్ బ్యాంకులు గత కొంతకాలంగా డిజిటల్ కరెన్సీల దిశగా అడుగులు వేస్తున్నాయి. 'ఇది(క్రిప్టో కరెన్సీ) పూర్తిగా కొత్త ఉత్పత్తి. దీని పట్ల అప్రమత్తంగా ఉన్నాం. ఆర్బీఐకి మాత్రమే కాదు, ప్రపంచానికే ఇది కొత్త' అని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
ఆర్బీఐ విడుదల చేసే డిజిటల్ కరెన్సీ(CBDC)పై నేడు ప్రపంచ దృష్టి కేంద్రీకృతమవుతోంది. ప్రయోగాత్మకంగా CBDCని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన దేశాల జాబితాలో భారత్ చేరింది. CBDC అంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న క్రిప్టో కరెన్సీల వంటిది కాదు. అది రిజర్వ్ బ్యాంకు వంటి కేంద్ర బ్యాంకుల హామీ ఉన్న చట్టబద్ధ కరెన్సీ. అదే సమయంలో CBDC కాగితం కరెన్సీ లేదా నాణెం కాదు. దీనిని ఈ రెండు రూపాల్లోకీ మార్చడం కుదరదు. CBDC అనేది ఫోన్, డిజిటల్ వ్యాలెట్, కంప్యూటర్ ద్వారా మాత్రమే ఉపయోగించే డిజిటల్ కరెన్సీ.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications