క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా మార్కెట్ నిపుణులు.. అది ఓ పనికిరానిది అని దానికి విలువ ఉండదని తేల్చి చెప్పారు. డిజిటల్ కరెన్సీ జీరోకి పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగిత్తిస్తున్నాయి. కాగా గత వారం క్రిప్టో మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ వ్యాఖ్యలకు బలాన్ని కూడా ఇస్తున్నాయి.
గత 15 నెలల కాలంలో బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టిన చాలా మంది పెట్టుబడిదారులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 122,200 డాలర్ల గరిష్ట స్థాయి నుంచి సగానికి పైగా పడిపోయింది. అయితే ధరలు పడిపోయిన వెంటనే బై ఆన్ ద డిప్స్ అనే నినాదంతో బిట్ కాయిన్ మద్దతుదారులు మళ్లీ రంగంలోకి దిగారు. దాంతో శుక్రవారం బిట్‌కాయిన్ కొంత మేరకు రికవరీ సాధించింది. తాత్కాలికంగా ఈ ర్యాలీ కొనసాగడానికి తగినంత మంది ఆశావాదులు ఉండవచ్చు. అయితే అసలు ప్రశ్న అది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే బిట్‌కాయిన్‌కు నిజంగా ఏమైనా విలువ ఉందా?

అమెరికా మార్కెట్ పరిశోధనా సంస్థ పివోటస్ పార్టనర్స్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ రిచర్డ్ ఫార్ ఈ ప్రశ్నకు చాలా కఠినమైన సమాధానం ఇచ్చారు. ఆయన బిట్‌కాయిన్‌కు సున్నా ధర లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది సహజంగానే పెద్ద సంచలనం రేపింది. కానీ ఆయన వాదనను లోతుగా పరిశీలిస్తే.. దానిలో తర్కం కనిపిస్తుంది. బిట్‌కాయిన్ లేదా ఇతర క్రిప్టోకరెన్సీలకు ఆదాయం లేదు, ఆస్తులు లేవు. వాటి వెనుక ఉన్న ఏకైక ఆధారం.. వాటిని కలిగి ఉన్న వారి నమ్మకం మాత్రమే అని తెలిపారు.
Bitcoin విలువ ఎప్పుడు సున్నా అవుతుందో తేదీ చెప్పడం కష్టం. కానీ దీర్ఘకాలంలో అది జరగవచ్చనే అవకాశం ఉందని ఈ వాదన చెబుతోంది. ఇంకా ముందుకు వెళ్లి, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం కంటే లాభమే ఎక్కువ తీసుకువస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే.. ప్రజల పొదుపులను తీసుకొని, వాటిని ఉత్పాదక పెట్టుబడులుగా మార్చడం. మీరు బ్యాంకులో డబ్బు జమ చేస్తే, అది రుణాల రూపంలో పరిశ్రమలు లేదా గృహ నిర్మాణాలకు వెళ్తుంది. మీరు ఒక కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తే, ఆ సంస్థ కార్యకలాపాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తారు. ప్రభుత్వ బాండ్లు కొంటే, ప్రభుత్వ పెట్టుబడులకు మీరు నిధులు సమకూర్చినట్టే.
ఈ వ్యవస్థ లోపరహితమైనది కాదు. 2008-09 ఆర్థిక సంక్షోభం తర్వాత, లార్డ్ అడైర్ టర్నర్ ఆర్థిక రంగంలో పెద్ద భాగం సామాజికంగా పనికిరానిదని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమైనప్పటికీ, కాలక్రమంలో ఆయన మాటల్లో నిజం ఉందని స్పష్టమైంది. కానీ కనీసం ప్రధాన స్రవంతి ఆర్థిక రంగం ఏదో ఒక ఉత్పాదక పాత్రను పోషిస్తోంది. హైటెక్ సంస్థలు, కృత్రిమ మేధస్సు అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి వాటికి అది మూలధనాన్ని అందిస్తోంది. బిట్‌కాయిన్ విషయంలో మాత్రం అలాంటి పాత్ర ఏదీ కనిపించదు.
కొందరి అభిప్రాయం ప్రకారం..బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలు పూర్తిగా కూలిపోతే మనం హర్షించాలి. అవి సామాజికంగా పనికిరానివి. కొంతమందికి నష్టాలు తప్పవు, అది బాధాకరమే. కానీ 2008 లాంటి వ్యవస్థాత్మక సంక్షోభం వచ్చే ప్రమాదం లేదు. బిట్‌కాయిన్ మార్కెట్ విలువ సుమారు 1.4 ట్రిలియన్ డాలర్లు. మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువ. ఇది అమెరికా ఈక్విటీ మార్కెట్ విలువ దాదాపు 70 ట్రిలియన్ల డాలర్ల కన్నా ఎక్కువ.ఏదేమైనా క్రిప్టో బుడగ కూలిపోతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అవసరం లేని అధిక ఉత్సాహం తగ్గి.. నిజమైన ఉత్పాదక రంగాలకు మూలధనం మళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications