Bitcoin: క్రిప్టో కరెన్సీల్లో ఎక్కువగా వినిపించే పేరు బిట్ కాయిన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో ఇన్వెస్టర్లు ఎక్కువగా దీనిలోనే పెట్టుబడి పెడుతుంటారు. మన దేశంలోనూ వీటి పట్ల ఆసక్తి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా బిట్ కాయిన్ ఓ అరుదైన ఫీట్ సాధించింది. 2022 నష్టాల నుంచి మళ్లీ పుంజుకుని ఏడాది గరిష్ఠానికి చేరింది.
న్యూయార్క్‌లో మంగళవారం ఉదయం 11:43కు అతిపెద్ద డిజిటల్ అసెట్ గా చెప్పబడుతున్న బిట్ కాయిన్ వండర్ సృష్టించింది. 11.5 శాతం పెరిగి 35 వేల డాలర్ల మార్కును టచ్ చేసింది. గతేడాది కనిష్ఠంతో పోలిస్తే 102 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETF) నుంచి ఏర్పడిన డిమాండ్ అంచనాలు.. బిట్ కాయిన్ లాభపడటానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొదటిసారిగా US స్పాట్ బిట్ కాయిన్ ETFకు అతి త్వరలో ఆమోదం లభించనుంది. అందువల్ల ఈ డిజిటల్ అసెట్ భారీగా పెరిగింది. ప్రముఖ అసెట్ మేనేజర్స్ బ్లాక్ రాక్ ఇంక్, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈ తరహా ఉత్పత్తులను అందించే రేసులో ఉన్నాయి. ETFలు క్రిప్టోకరెన్సీ వినియోగాన్ని మరింత పెంచుతాయని డిజిటల్ అసెట్ ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు.
బిట్ కాయిన్ లో నేరుగా పెట్టుబడి పెట్టే ETFను అనుమతిస్తే.. అంతర్లీన మార్కెట్లలో మోసాలు, తారుమారు వంటి నష్టాలు ఏర్పడే అవకాశం ఉందని US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ అభిప్రాయపడింది. దాని అభ్యంతరాలను అక్కడి ఫెడరల్ అప్పీల్ కోర్టు తిరస్కరించింది. తద్వారా స్పాట్ బిట్‌కాయిన్ ETFని సృష్టించే ప్రయత్నంలో ఉన్న గ్రేస్కేల్ ఇన్వెస్ట్‌మెంట్స్ LLC విజయం సాధించినట్లయింది. దీంతో బిట్ కాయిన్ ETFకు లైన్ క్లియర్ అయింది.


Click it and Unblock the Notifications