Mutual Funds: కరోనా అనంతరం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మార్కెట్‌పై అంతగా అవగాహన లేనివారు మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గుచూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీటిలో డైరెక్ట్, రెగ్యులర్ అనే రెండు రకాల ఫండ్స్ ఉంటాయి. చాలా మందికి వాటి మధ్య తేడా తెలియదు. ఎవరో బ్రోకర్ చెప్పిన మాటలు నమ్మి, ఏమీ ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేసి తక్కువ రాబడితో సరిపెట్టుకుంటారు.
డైరెక్ట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC)తో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. పంపిణీదారులు లేదా ఏజెంట్ల ప్రమేయం ఇందులో ఉండదు. వ్యక్తిగత పెట్టుబడిదారులు నచ్చిన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఏజెంట్/బ్రోకర్ ఫీజులు లేకపోవడంతో.. సాధారణ ప్లాన్‌లతో పోలిస్తే ఇందులో తక్కువ వ్యయ నిష్పత్తి ఉంటుంది. అందుకే అధిక రాబడిని అందిస్తాయి.

రెగ్యులర్ ప్లాన్‌లో ఏజెంట్లు, బ్రోకర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బ్యాంకర్లు లేదా సలహాదారుల క్రియాశీల భాగస్వామ్యం ఉంటుంది. పెట్టుబడిదారులు ఈ మధ్యవర్తుల ద్వారానే పెట్టుబడి పెడతారు. AMC వీరికి కమీషన్ చెల్లిస్తుంది. అయితే ఇది మీ స్వంత జేబు నుంచి లేదా పెట్టుబడిపై వచ్చిన రాబడి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కువ వ్యయ నిష్పత్తి ఉంటుంది. డెరెక్ట్ ప్లాన్స్‌తో పోలిస్తే తక్కువ రాబడి రావడానికి ప్రధానం కారణం ఇదే అని చెప్పవచ్చు.
రెగ్యులర్ ప్లాన్‌ల కంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన రాబడిని అందించినట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్‌లో ఫుల్‌టైమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్తరథి పాండా తెలిపారు. ఇది తాను చెప్పేది కాదని చారిత్రక డేటా స్పష్టంగా తెలియజేస్తోందన్నారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు తగిన ఫండ్ ఎంచుకునే నైపుణ్యం ఉండటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అర్హత కలిగిన సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు, అనుభవజ్ఞులైన నిపుణులచే నిర్వహించబడే రెగ్యులర్ ప్లాన్‌లను ఎంచుకోవడం ఉత్తమం.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications