RED Bull: రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ సహ వ్యవస్థాపకుడు ఆస్ట్రియన్ బిలియనీర్ డైట్రిచ్ మాటెస్చిట్జ్ కన్నుమూశారు. ఆయనకు 'రెడ్ బుల్ ఫార్ములా వన్ రేసింగ్' జట్టు కూడా ఉంది. ఆయన మరణ వార్తను కంపెనీ అధికారులు ఈ రోజు ప్రకటించారు. 78 ఏళ్ల వయస్సులో ఆయన మృతి కంపెనీకి తీరని లోటని చెప్పుకోవాలి.

మరణానికి కారణాలు..
డైట్రిచ్ మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. రెడ్ బుల్ బ్రాండ్ ఆసియాలోనే కాకుండా పశ్చిమ దేశాల్లో సైతం మంచి గుర్తింపుతో పెద్ద సక్సెస్ అయింది. డ్రైటిచ్ కంపెనీని బాగా పాపులర్ చేసేందుకు, ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లేందుకు క్రీడలపై భారీగా పెట్టుబడి పెట్టారు. మోటారు క్రీడల ప్రపంచంలో డైట్రిచ్‌కు సంరక్షకుడిగా పాత్ర ఉందని మోటార్ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ FIA ప్రెసిడెంట్ మహ్మద్ బెన్ సులేయం అన్నారు.

172 దేశాల్లో వ్యాపారం..
సూపర్ క్రేజ్ పొందిన రెడ్ బుల్.. గత ఏడాది 172 దేశాల్లో ఏకంగా 100 కోట్ల క్యాన్ల డ్రింక్ అమ్మింది. డైట్రిచ్ తన సామ్రాజ్యాన్ని కేవలం పానీయాల విక్రయానికి పరిమితం చేయలేదు. అతను మోటార్ స్పోర్ట్స్, మీడియా, రియల్ ఎస్టేట్, గ్యాస్ట్రోనమీ రంగాలకు విస్తరించి విజయవంతంగా నడుపుతున్నారు. అతని కంపెనీ ఫుట్‌బాల్ క్లబ్‌లు, హాకీ, రేసింగ్ జట్లను నిర్వహిస్తోంది. ప్రపంచంలోని వందలాది మంది క్రీడా తారలతో వారికి అగ్రిమెంట్లు సైతం ఉన్నాయి.

1984లో వ్యాపారం ప్రారంభం..
1984లో డైట్రిచ్, థాయ్ వ్యాపారవేత్త షాలియో యువిద్య 'రెడ్ బుల్'ని సంయుక్తంగా స్థాపించారు. ఆ సమయంలో షాలియో-థాయ్‌తో తయారు చేసిన 'క్రేటింగ్ డెంగ్' అనే డ్రింక్ ఎనర్జీ డ్రింక్‌గా మార్కెట్‌ను ముంచెత్తుతోంది. మూడు సంవత్సరాల నిరంతర రీసెర్చ్ డైట్రిచ్ పానీయాన్ని మరింత మెరుగుపరిచారు. ఆ తర్వాత దానిని 'రెడ్ బుల్' పేరుతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు.

రాకెట్ వేగంతో..
డైట్రిచ్ షేర్ ధర రాకెట్ వేగంతో పెరగడం మొదలైంది. ముందుగా వారు యూరోపియన్ మార్కెట్ ను ఆతర్వాత అమెరికా మార్కెట్లోకి వెళ్లి ప్రజాదరణ పొందారు. అలా'రెడ్ బుల్' రేసింగ్ టీమ్ కూడా ఫార్ములా వన్ ప్రపంచంలో విజయాన్ని అందుకోగలిగింది. వారు 2010, 2011, 2012, 2013లో బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నారు. జర్మనీకి చెందిన సెబాస్టియన్ వెటెల్ వరుసగా నాలుగుసార్లు డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అలా ఫోర్డ్, జాగ్వార్ నుంచి సైతం రేసింగ్ జట్లను కొన్నారు. ఆ తర్వాత ఆయన మీడియా వ్యాపారం సైతం మంచి గుర్తింపును పొందింది.


Click it and Unblock the Notifications