పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(మార్చి 21, సోమవారం) స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30 డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది.
ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ, ప్రస్తుతం కాస్త తగ్గి 100 డాలర్ల వద్ద ఉంది. నాలుగు నెలల్లో దాదాపు 30 డాలర్లు పెరగడంతో మన వద్ద ఫలితాల తర్వాతనైనా ధరలు పెరుగవచ్చునని వార్తలు వచ్చాయి. కానీ ధరలు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 20, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది.

ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి.
లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది.లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అతి తక్కువగా దొరుకుతుంది పోర్ట్ బ్లెయిర్‌లో. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.82.96, లీటర్ డీజిల్ రూ.77.13గా ఉంది.

మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండగా, పలు ఇతర దేశాల్లో ఈ ధరలు భారీగా పెరిగాయి. పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది రోజుల క్రితం భారీగా పెరిగాయి. అక్కడి ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ధరలను రూ.10 నుండి రూ.12 వరకు పెంచింది. దీంతో ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.160కి చేరుకుంది. మనవద్ద మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ రూ.207కు చేరుకుంది.
అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 40 శాతం పెరిగిన కారణంగా దేశీయంగా బల్క్ యూజర్లకు విక్రయించే డీజిల్ ధర లీటర్‌కు రూ.25 పెరిగింది. అయితే పెట్రోల్ పంపుల వద్ద కొనే సామాన్య పౌరులకు మాత్రం ఈ ధర నుండి మినహాయించింది. సాధారణంగా బల్క్ యూజర్లకు వర్తించే ధరలు రిటైల్ ధరలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఈ అధిక ధర నుండి తప్పించుకోవడానికి వారు పెట్రోల్ పంపుల వైపు మళ్లారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications