ఇంధన ధరలు వరుసగా 18వ రోజు (బుధవారం) పెరిగాయి. అయితే నేడు పెట్రోల్ ధర పెరగలేదు. కానీ డీజిల్ ధర మాత్రం 48 పైసలు పెరిగింది. లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు చమురురంగ సంస్థలు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్ష ప్రారంభించాయి. అప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. పెట్రోల్ ధర నేడు మొదటిసారి పెరగలేదు. స్థిరంగా ఉంది.

ఢిల్లీలో పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువ
ఈ రోజు పెట్రోల్ ధర పెరగకపోవడం, డీజిల్ ధర దాదాపు అర్ధరూపాయి పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.76గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.79.88 గా ఉంది. ఢిల్లీలోను ఇంధన ధరలు రూ.80కి చేరువకు వచ్చాయి.

నాడు ఇంధన ధరల మధ్య రూ.30 తేడా
ప్రభుత్వ డేటా ప్రకారం 2012లో పెట్రోల్, డీజిల్ మధ్య ధరల్లో తేడా రూ.30కి పైగా ఉంది. ఢిల్లీలో జూన్ 18, 2012వ తేదీన లీటర్ పెట్రోల్ ధర రూ.71.16 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.40.91గా ఉంది. ముంబైలో జూన్ 28, 2012లో లీటర్ పెట్రోల్ రూ.76.45, డీజిల్ రూ.45.28గా ఉంది. అయితే ఆ తర్వాత నుండి పెట్రోల్, డీజిల్ మధ్య ధరల్లో గ్యాప్ తగ్గింది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో అయితే పెట్రోల్ ధరను మించింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 1.74 శాతం ఎగిసి బ్యారెల్‌కు 43.83 డాలర్లు పలికింది. అంతర్జాతీయ సమాజం షట్ డౌన్ నుండి విముక్తి అవుతోంది. క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయి.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications