కొన్ని రోజుల క్రితం కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బంగారు వ్యాపారస్తులు కూడా పసిడిపై డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తున్నారు. ప్రపంచంలోనే పుత్తడి ఎక్కువగా వినియోగిస్తున్న అతిపెద్ద దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక వరుసగా బంగారం తగ్గుముఖం పడుతుండటంతో నాలుగో వారంలో కూడా వ్యాపారస్తులు డిస్కౌంట్లు ప్రకటించారు. అంతేకాదు బంగారం కొనుగోలుకు ప్రస్తుతం మంచి సమయం కాదన్న సెంటిమెంట్ కూడా ఉండటంతో పసిడిని కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆఫర్లు ఇస్తున్నాయి ఆయా బంగారు దుకాణాలు.
గత వారం బంగారం ధర ఔన్సుకు 40 డాలర్లు ఉండగా దాంతో పోల్చితే, అధికారిక దేశీయ ధరలపై 12.5% దిగుమతి మరియు 3% జిఎస్‌టితో కలిపి డిస్కౌంట్ ఔన్స్‌కు 30 డాలర్లకు పడిపోయింది. ఇక పండగల సీజన్ సమీపిస్తున్నప్పటికీ బంగారం ధరలు అధికంగానే ఉండటంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడం లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఒకవేళ తగ్గినా అరకొరగా ఉందని చెబుతున్న వ్యాపారస్తులు వచ్చేనెలలో దసరా పండగ ఉందని అయితే బంగారం మాత్రం కొనుగోలు చేస్తారన్న నమ్మకం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయంగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడటంతో సింగపూర్‌లో కొనుగోలుదారుల నుంచి బంగారంకు డిమాండ్ ఏర్పడింది. బంగారం ధరలు తగ్గేకొద్దీ కొనుగోలు దారులు బంగారంను కొనేందుకు ఆసక్తి చూపుతారని గోల్డ్ సిల్వర్ డీలర్ బ్రియాన్ లాన్ చెప్పారు. అయితే రీటెయిల్‌లో మాత్రం బంగారం కొనుగోళ్లు ఊహించిన స్థాయిలో ఉండవని చెప్పారు. బంగారం సేల్స్ గౌరవప్రదంగానే ఉన్నాయని అయతే గత నాలుగావారాలుగా తగ్గుతూ వస్తున్నాయని ఓ ప్రముఖ బంగారు దుకాణం సంస్థ సేల్స్ మేనేజర్ చెప్పారు. అయితే నాల్గవ త్రైమాసికంలోకి ప్రవేశించగానే ఆఫర్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు 0.82 శాతం తగ్గి 1942 డాలర్లకు దిగి వచ్చింది. వెండి ధర కూడా ఔన్స్ 1.38 శాతం తగ్గి 26.91 డాలర్లు పలికింది. అమెరికా - చైనా ట్రేడ్ వార్, భారత్ - చైనా సరిహద్దు టెన్షన్, డాలర్ వ్యాల్యూ, ఈక్విటీ వ్యాల్యూ, ప్రస్తుతం కరోనా మహమ్మారి-వ్యాక్సీన్ అంశం బంగారంపై ప్రభావం చూపిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications