Banking News: దేశంలోని దాదాపు 17 బ్యాంకులకు సంబంధించిన గుడ్ న్యూస్ ఇది. మీ డబ్బు ఈ 17 సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడితే ఈ వార్త తప్పకుండా మీకోసమే. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) మహారాష్ట్రలోని 8 సహా 17 సహకార బ్యాంకుల అర్హతగల డిపాజిటర్లకు అక్టోబర్‌లో చెల్లింపులు చేయనుంది. ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా జూలైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 17 బ్యాంకులపై డిపాజిటర్ల ఉపసంహరణలతో సహా ఇతర పరిమితులు విధించిన విషయం మనందరికీ తెలిసిందే.

DICGC చట్టం అంటే ఏమిటి?
DICGC అనేది RBI యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. ఇది బ్యాంక్ వినియోగదారుల రక్షణ కోసం ఏర్పాటు చేయబడింది. ఇది ప్రతి వినియోగదారుడికి రూ.5 లక్షల వరకు బ్యాంకు డిపాజిట్లపై బీమా రక్షణ కల్పిస్తుంది. ఖాతాదారులకు బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసం, పూర్తి భద్రత హామీతో ఖాతాలో డబ్బు జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం DICGCని ప్రారంభించింది. దీని కింద ఏరియా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, దేశం, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సహకార బ్యాంకులతో సహా అన్ని కమర్షియల్ బ్యాంకుల కస్టమర్లకు ఈ కవర్ లభిస్తుంది.

డబ్బు పొందటానికి ఏఏ పత్రాలు అవసరం..
పరిహారం పొందటానికి అర్హత కలిగిన డిపాజిటర్లు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల ద్వారా మద్దతు ఇవ్వవలసి ఉంటుందని DICGC స్పష్టం చేసింది. మెుత్తం 17 సహకార బ్యాంకుల్లో.. 8 మహారాష్ట్రలో, 4 ఉత్తరప్రదేశ్‌లో, 2 కర్ణాటకలో, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క బ్యాంక్ ఉన్నాయి.

మహారాష్ట్రలో బ్యాంకుల పేర్లు ఇవే..
మహారాష్ట్రలోని కార్పొరేటివ్ బ్యాంకుల్లో- సాహెబ్రావ్ దేశ్‌ముఖ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, సాంగ్లీ సహకరి బ్యాంక్, రాయ్‌గడ్ సహకరి బ్యాంక్, నాసిక్ జిల్లా గిర్నా సహకరి బ్యాంక్, నాసిక్ జిల్లా గిర్నా సహకారి బ్యాంక్, సాయిబాబా జనతా సహకారి బ్యాంక్, అంజన్‌గావ్ సుర్జీ నగరి సహకారి బ్యాంక్ ఉన్నాయి. నగరి సహార బ్యాంక్, కర్మలా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ల కస్టమర్లకు ప్రస్తుతం ప్రయోజనం కలగనుంది.

కర్ణాటకలో..
కర్ణాటక శ్రీ మల్లికార్జున పట్టణ సహకారి బ్యాంక్ రెగ్యులర్ (మస్కీ), శ్రీ శారదా మహిళా సహకారి బ్యాంక్ (తుమకూరు) కూడా ఈ జాబితాలో చేర్చబడ్డాయి. న్యూఢిల్లీలోని రామ్‌గర్హియా కో-ఆపరేటివ్ బ్యాంక్, సూరిలోని సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ బ్యాంక్ డిపాజిటర్లకు అక్టోబర్‌లో DICGC ద్వారా చెల్లింపు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంక్..
DICGC వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ జాబితాలో ఉంది. ఇదే సమయంలో.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (సీతాపూర్), నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (బహ్రైచ్) మరియు యునైటెడ్ ఇండియా కంపెనీ కో-ఆపరేటివ్ బ్యాంక్ (నగీనా) ఉన్నాయి.


Click it and Unblock the Notifications