Savji Dholakiya: బేకరీలో పనిచేసిన కుబేరుడి కొడుకు.. ఎందుకో తెలుసా..??
Savji Dholakiya: సూరత్‌లోని అత్యంత ధనవంతుడిగాసావ్జీ ధంజీ ధోలాకియా పేరు పలుమార్లు వార్తల్లో నిలిచింది. రైతు కుటుంబంలో జన్మించిన ఈయన విజయవంతమైన వజ్రాల వ్యాపారిగా మారి వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు.
ధోలాకియాలు తరచూ తమ కంపెనీ ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు, ఫ్లాట్లు, ఆభరణాలను బహుమతిగా ఇస్తుంటారు. సావ్జీ ధోలాకియా 1962 ఏప్రిల్ 12న గుజరాత్‌లోని దుధాలా గ్రామంలో జన్మించారు. సావాజీకి మరో ముగ్గురు సోదరులు ఉన్నారు. స్థోమత లేకపోవటంతో నాలుగో తరగతిలోనే విద్యను మానేయాల్సి వచ్చింది. తర్వాత మామతో కలిసి సూరత్‌లో పనిచేయటం ప్రారంభించాడు. మామయ్య వజ్రాల వ్యాపారంలో తన సోదరులు హిమ్మత్, తులసి కూడా కలిపి పనిచేయటం ప్రారంభించారు.

అలా 1992లో సావాజీ తన ముగ్గురు సోదరులతో కలిసి హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీకి చెందిన డైమండ్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను సూరత్‌లో ఏర్పాటు చేశారు. ముంబైలో ఎగుమతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 2014 నాటికి కంపెనీ బలమైన వృద్ధిని సాధించింది. అప్పటికే కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 6,500కు చేరుకుంది. ఆ తర్వాత 2005లో 'కిస్నా' పేరుతో ఆభరణాల బ్రాండ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా 6,250 అవుట్‌లెట్లతో అతిపెద్ద వజ్రాభరణాల బ్రాండ్‌గా కొనసాగుతోంది.
అయితే సులభంగా సంపదను పొందితే దానిని నిర్వహించటం వారసులకు అంత సులువు కాదు. అయితే మనుగడ కోసం మనుషులు చేసే పోరాటం గురించి తెలుసుకుంటేనే.. ప్రతి రూపాయినీ ఎలా ఖర్చు చేయాలి అనే జీవిత పాఠాలు తెలుస్తాయి. ఇదే పరీక్షను సదరు వజ్రాల వ్యాపారి కుమారుడికి పెట్టాడు. అయితే సంపాదన కోసం లేదా పనికోసం తన పేనును వినియోగించకూడదని ఆయన కండిషన్ పెట్టారు.
దీంతో సావాజీ ధంజీ కుమారుడు ద్రవ్యను ఇంటి పేరును ఉపయోగించకుండా స్వతంత్రంగా పనిచేయమని ప్రోత్సహించాడు. ద్రవ్య.. షూ స్టోర్, మెక్‌డొనాల్డ్స్, కాల్ సెంటర్‌తో సహా అనేక ఉద్యోగాలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, ద్రవ్య విలువైన జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. చివరికి ఒక బేకరీలో రోజుకు రూ.200 జీతానికి ఉద్యోగం సంపాదించాడు. అలా సదరు వ్యాపారి తన పిల్లలకు అసలైన జీవిత పాఠాలను నేర్పించారు.


Click it and Unblock the Notifications