భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒకటే చర్చ.. అది ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురందర్' సృష్టిస్తున్న బాక్సాఫీస్ సునామీ. కేవలం 32 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1214 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'RRR' (రూ. 1230 కోట్లు) రికార్డును అధిగమించేందుకు సిద్ధంగా ఉంది.

సౌత్ మార్కెట్ లేకుండానే ఈ రేంజ్ వసూళ్లా?
శాక్ నిల్క్ (sacnilk) అనే సైట్ కథనం ప్రకారం ప్రస్తుతానికి ధురందర్ (Dhurandhar) కలెక్షన్.. రూ.1214 కోట్లు. సాధారణంగా ఒక సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరాలంటే సౌత్ ఇండియా (తెలుగు, తమిళం) మార్కెట్ కీలకం. కానీ 'ధురందర్' ప్రధానంగా నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లపై ఆధారపడి ఈ స్థాయికి చేరుకోవడం బిజినెస్ పరంగా ఒక పెద్ద వింత.
- నిజమా? ఫేకా?: ట్రేడ్ వర్గాల ప్రకారం భారత్‌లో ఈ సినిమా నెట్ కలెక్షన్ రూ. 776.75 కోట్లు కాగా.. నిర్మాతలు (జియో స్టూడియోస్) ఇది ఇప్పటికే రూ. 800 కోట్లు దాటిందని క్లెయిమ్ చేస్తున్నారు.
- తెలుగు వెర్షన్ లేకపోయినా: తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదల లేదా ప్రమోషన్లు లేకపోయినా, కేవలం హిందీ వెర్షన్, ఓవర్సీస్ వసూళ్లతో ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు.
ఓవర్సీస్‌లో 'పుష్ప 2', 'సుల్తాన్' రికార్డులు గల్లంతు!
ఓవర్సీస్ మార్కెట్‌లో 'ధురందర్(Dhurandhar)' సంచలనం సృష్టిస్తోంది. మిడిల్ ఈస్ట్ (దుబాయ్, సౌదీ వంటి దేశాలు) లో ఈ సినిమా విడుదల కాలేదు. ఒకవేళ అక్కడ కూడా విడుదలై ఉంటే కలెక్షన్లు మరో 10 మిలియన్ డాలర్లు పెరిగేవని అంచనా. అయినప్పటికీ..
- ధురందర్ ఓవర్సీస్: $31.3 మిలియన్లు (రూ. 280 కోట్లు)
- పుష్ప 2 ఓవర్సీస్: $31 మిలియన్లు
- సుల్తాన్ ఓవర్సీస్: $29.8 మిలియన్లు ఈ లెక్కలతో అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ల ఓవర్సీస్ రికార్డులను రణవీర్ సింగ్ అధిగమించాడు.
హాలీవుడ్ మూవీ 'అవతార్'కు గట్టి పోటీ!
డిసెంబర్ చివరలో విడుదలైన అవతార్ 3 ( Avatar: Fire and Ash) వంటి భారీ హాలీవుడ్ చిత్రానికి సైతం 'ధురందర్' చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం 5వ వారంలో ఉన్న ఈ సినిమా.. అవతార్‌ను వెనక్కి నెట్టి మరీ వసూళ్లను రాబడుతోంది. 32వ రోజున తొలిసారిగా కలెక్షన్లలో 60-65% డ్రాప్ కనిపించినప్పటికీ.. సింగిల్ డే గ్రాస్ రూ. 10 కోట్ల లోపు రావడం ఇదే మొదటిసారి.
ధురందర్ సక్సెస్ సీక్రెట్..
ధురందర్ కలెక్షన్స్ (Dhurandhar collection) ఇంతలా పెరగడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా కరాచీలో అండర్ కవర్ ఆపరేషన్ చేసే 'హంజా' పాత్రలో రణవీర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. మార్చి 2026లో పార్ట్ 2 వస్తుందని ప్రకటించడం ఈ సినిమాకు లాంగ్ రన్ ఇచ్చింది. భాషతో సంబంధం లేకుండా స్పై థ్రిల్లర్లకు ఉన్న గ్లోబల్ అప్పీల్ ఈ చిత్రానికి ప్లస్ అయింది.
ఏది ఏమైనా సౌత్ రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇచ్చే పెద్ద సినిమాలు లేకపోవడం కూడా 'ధురందర్'కు కలిసి వచ్చిందని కొందరు ట్రేడ్ నిపుణులు అంటున్నారు.మొత్తంగా తెలుగు రాష్ట్రాల సపోర్ట్ లేకుండా ఒక హిందీ సినిమా ఈ స్థాయిలో కలక్షన్స్ రాబట్టడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కొత్త అధ్యాయం అనే చెప్పాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications