రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' విడుదలకు సిద్ధమైంది. మార్చి 19న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం 'ధురంధర్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 1300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దీంతో ఈ సీక్వెల్ లో నటించిన స్టార్ నటీనటుల పారితోషికాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అసలు ఈ మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

రణవీర్ సింగ్ పారితోషికం ఎంత?
ఈ చిత్రంలో ఇండియన్ స్పై జస్కిరాత్ సింగ్ రంగీ (హంజా అలీ మజారీ) పాత్రలో రణవీర్ సింగ్ మరోసారి అలరించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీక్వెల్ కోసం రణవీర్ సుమారు రూ. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా స్థాయిని బట్టి తనకున్న క్రేజ్‌ను బట్టి రణవీర్ ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం సినిమా బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇతర స్టార్ల సాలరీల వివరాలు
రణవీర్ సింగ్‌తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన ఇతర నటీనటులకు కూడా భారీగానే ముట్టజెప్పినట్లు సమాచారం.
- సంజయ్ దత్: ఎస్పీ చౌదరి అస్లాం పాత్రలో కనిపించనున్న సంజయ్ దత్ సుమారు రూ. 10 కోట్లు పారితోషికం అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
- ఆర్. మాధవన్: నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజయ్ సన్యాల్‌గా నటించిన మాధవన్ కు ఈ సినిమా కోసం రూ. 9 కోట్లు అందినట్లు సమాచారం.
- అక్షయ్ ఖన్నా: ఫ్లాష్ బ్యాక్ సీన్లలో రెహ్మాన్ డకైత్ పాత్రలో కనిపించనున్న ఈయనకు రూ. 2.5 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
- అర్జున్ రాంపాల్ & సారా అర్జున్: మేజర్ ఇక్బాల్ గా నటించిన అర్జున్ రాంపాల్ , యాలీనా జమాలీ పాత్ర పోషించిన సారా అర్జున్ లు రూ. 1 కోటి వరకూ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
బిజినెస్ అంచనాలు.. కథా నేపథ్యం..
మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన వండర్స్ దృష్ట్యా ధురంధర్ 2 (Dhurandhar 2) పై భారీగా పెట్టుబడి పెట్టారు. కేవలం నటీనటుల పారితోషికాలే సుమారు 60-70 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. ఇక ప్రొడక్షన్ ఖర్చులు, విదేశాల్లో షూటింగ్ అన్నీ కలిపి చూస్తే ఈ సినిమా బడ్జెట్ భారీగానే ఉంది. జస్కిరాత్ సింగ్ రంగీ ఎలా హంజా అలీ మజారీగా మారాడు? అతడు సరిహద్దులు దాటి చేసిన ప్రమాదకరమైన మిషన్లు ఏంటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సీక్వెల్ సాగనుంది.
ఏదేమైనా భారీ తారాగణం, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు , గ్రిప్పింగ్ స్పై స్టోరీతో వస్తున్న 'ధురందర్ 2 (Dhurandhar 2)', బాక్సాఫీస్ వద్ద తన పాత రికార్డులను తానే తిరగరాస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications