2011 నుంచి 2016 మధ్య దీవాన్ హౌసింగ్ పైనాన్స్ లిమిటెడ్ (DHFL) రూ.12,773 కోట్లను 79 కంపెనీలకు డైవర్ట్ చేసినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది. 1 లక్ష మంది కల్పిత రిటైల్ కస్టమర్లకు లోన్లు ఇచ్చినట్లుగా రికార్డ్ ఉంది. కానీ వీటిని DHFL ప్రమోటర్స్‌తో సంబంధం ఉన్న 79 కంపెనీలకు తరలించినట్లుగా గుర్తించింది.
ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు డీహెచ్ఎఫ్ఎల్ ఐదు కంపెనీలకు రూ.2,186 కోట్ల రుణాలు ఇచ్చింది. వీటిని పరిశీలించినప్పుడు విషయం వెలుగు చూసింది. దివంగత గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మెమన్‌కు చెందిన వర్లీలోని మూడు ప్రాపర్టీలను రూ.225 కోట్లకు సన్ బ్లింక్ రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో సన్ బ్లింక్ ఈడీ స్కానర్లో ఉంది.

డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్‌ను గత వారం ఈడీ అరెస్టు చేసింది. ఇక్బాల్ మెమన్‌కు చెందిన ప్రాపర్టీలతో మనీలాండరింగ్ లింక్ కలిగి ఉన్న ఆరోపణలపై అరెస్టు చేసింది. గత ఏడాది కాలంగా ఈ కేసులో అరెస్టైన ఐదో వ్యక్తి వాధ్వాన్. డీహెచ్ఎఫ్ఎల్ ఫండ్స్‌ను డైవర్ట్ చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించినట్లుగా భావిస్తున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ నుంచి షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు.
డీహెచ్ఎఫ్ఎల్ పై దివాలా ప్రక్రియను చేపడుతున్నట్లు ఆర్బీఐ గత ఏడాది స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ కంపెనీ బోర్డును రద్దు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ వివిధ బ్యాంక్స్, మ్యూచ్‌వల్ ఫండ్స్ సహా రుణదాతలకు రూ.లక్ష కోట్ల వరకు రుణాల్ని చెల్లించాలి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications