భారతదేశంలో బంగారం కొనడం ఒక సంప్రదాయం మాత్రమే కాదు. ఇది మన భద్రత, విలువ, భావోద్వేగాల ప్రతీక అని అనడం కరెక్ట్. ప్రతి పండుగ, ముఖ్యంగా ధన్‌తేరాస్ సమయానికి బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఈసారి ధన్‌తేరాస్‌కి ఒక ప్రత్యేకత ఉంది. గత సంవత్సరం ధన్‌తేరాస్ నుండి ఇప్పటి ధన్‌తేరాస్ వరకు బంగారం 60 శాతం రాబడి ఇచ్చింది. ఇది గత ఐదు సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరుగా చెప్పుకోవచ్చు.
2020-21లో కరోనా ప్రభావంతో Gold రేట్లు తగ్గినా, ఆ తర్వాతి కాలంలో అవి నిరంతరంగా పెరుగుతూ, ఇప్పుడు సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ధన్‌తేరాస్‌కి ముందు రోజే, MCXలో 10 గ్రాముల బంగారం రూ. 1,32,294 వద్ద, వెండి 1 కిలో రూ. 1,70,415 వద్ద ట్రేడయ్యాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న అత్యధిక రేటు.

బంగారం ధరలు ఎందుకు ఇంత పెరిగాయి?: నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ర్యాలీకి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. అమెరికా, చైనా, ఇండియా వంటి దేశాల రిజర్వ్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారం కొంటున్నాయి. గత ఏడాది వారు 1,180 టన్నుల వరకు కొనుగోలు చేశారు. ఈ డిమాండ్ కొనసాగితే, రేట్లు మరింత ఎగిసే అవకాశం ఉంది. అలాగే అమెరికా డాలర్‌పై ఆధారాన్ని తగ్గిస్తూ అనేక దేశాలు Gold వైపు మళ్లుతున్నాయి. ఇది బంగారం ధరలను ప్రపంచవ్యాప్తంగా బలపరుస్తుంది.
ఇక బంగారం ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్‌లలో పెట్టుబడులు పెరిగాయి. ఇది రేట్లను రికార్డు స్థాయికి నెట్టివేస్తోంది.మరోవైపు ట్రంప్ సుంకాల విధానం, యుద్ధ పరిస్థితులు, వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు, ఇవన్నీ పెట్టుబడిదారులను బంగారం వైపు నడిపిస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గడం: డబ్బు ముద్రణ పెరగడం వల్ల కరెన్సీ బలహీనమవుతుంది. ఫలితంగా బంగారం సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తుంది.
యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం, వచ్చే దీపావళి నాటికి బంగారం ధర రూ. 1,45,000 నుండి రూ. 1,50,000 వరకు చేరే అవకాశం ఉంది. అంటే, ఇంకా 10-15 శాతం పెరుగుదల సాధ్యమే. ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నందున.. నిపుణులు దశల వారీగా పెట్టుబడి చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. బంగారం ETFలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, లేదా ఇ-గోల్డ్ ప్లాట్‌ఫామ్‌లు ద్వారా పెట్టుబడి చేస్తే భౌతిక నిల్వ సమస్యలు ఉండవు. ఇప్పటికే బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు తమ హోల్డింగ్‌ను కొనసాగించవచ్చు. కొత్త పెట్టుబడిదారులు చిన్న తగ్గుదలలను ఉపయోగించి దశల వారీగా కొనుగోలు చేయాలి.
మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ జషన్ అరోరా మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్లో దూకుడుగా కొనుగోళ్లు చేయకండి. బదులుగా, ప్రతి నెలా చిన్న మొత్తాలతో క్రమంగా బంగారం కొనడం ఉత్తమ మార్గమని సలహా ఇచ్చారు. నిపుణుల సూచన ప్రకారం.. ఒక పెట్టుబడిదారుడి పోర్ట్‌ఫోలియోలో 10 నుంచి 15 శాతం భాగం బంగారం లేదా వెండి రూపంలో ఉండాలి. ఇది రిస్క్ ప్రొటెక్షన్, దీర్ఘకాలిక సంపద సృష్టి రెండింటికీ సరైన సమతుల్యతను ఇస్తుంది.బంగారం ఎప్పటికీ భారతీయుల మనసులో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. అది కేవలం ఆభరణం కాదు, అది భవిష్యత్తు భద్రతకు ప్రతీకగా నిలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications