బంగారం ఈ ధర వద్దకు వచ్చాక కొంటే మీరు నష్టపోరు..కీలక సూచనలు చేసిన బ్యాంకింగ్ నిపుణులు
పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ముందు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, సుంకాలపై అనిశ్చితి, ప్రపంచ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు పసిడి పెరుగుదలలో ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. ఈ దీపావళి, ధంతేరాస్‌లలో Gold కొనడానికి ఉత్తమ మార్గం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క అయోమయంలో ఉన్నారు.
అయితే ఇప్పుడు పెట్టుబడిదారులకు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటంటే.. ఆభరణాలు, నాణేలు, కడ్డీలు రూపంలో కొనుగోలు చేయవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే పెట్టుబడి, అసలు బంగారాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు.RBI జారీ చేసిన ప్రభుత్వ బాండ్, ఇది సురక్షితంగా ఉంటాయి కాబట్టి డిఫాల్ట్ రిస్క్ లేదు. బంగారంలోని నిల్వలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెట్టుబడి చేసే నిధులు.

పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు గురించి నిపుణులు పలు చిట్కాలు సూచిస్తున్నారు.. పెట్టుబడిదారులు తక్కువ మొత్తంలో భౌతిక Gold మాత్రమే కొనుగోలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని గోల్డ్ ETFలు లేదా ఇతర విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ విధానం ధరల క్షీణత సమయంలో భద్రతను పెంచుతుంది. ఈక్వినోమిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు జి. చొక్కలింగం,జెఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మీర్ అభిప్రాయం ప్రకారం.. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, పెద్ద మొత్తంలో భౌతిక బంగారం కొనుగోలు చేయడం తగదని హెచ్చరిస్తున్నారు.
2025 ప్రారంభం నుండి బంగారం ధరలు సుమారుగా 51 శాతం పెరిగాయి. మిరే అసెట్ షేర్‌ఖాన్ నిపుణులు ప్రకారం.. రాబోయే నెలల్లో ధరలు 3,800 డాలర్లు (సుమారు రూ. 1,14,600) దాటవచ్చని, దీర్ఘకాలంలో 4,000 డాలర్లు (సుమారు రూ. 1,20,000)ను చేరవచ్చని అంచనా వేశారు. మద్దతు స్థాయి (కొనుగోలు స్థాయి) ఏంటంటే సుమారు 3,700 డాలర్లు (రూ. 1,11,500), 3,675 డాలర్లు (రూ. 1,10,800), 3,600 డాలర్లు (రూ. 1,08,500) వద్ద ఉన్నాయి. ఈ ధరల వద్ద మీరు కొనుగోలు చేసినట్లయితే ఎటువంటి నష్టాలు రావు. ధర తగ్గినా పెరిగినా పెద్దగా సమస్య ఉండదు.
నిపుణులు సూచన ప్రకారం, రిస్క్ తగ్గించడానికి.. ద్రవ్యోల్బణం నుండి రక్షించడానికి, మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో భద్రత పొందడానికి బంగారం, వెండి కలయికలో మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5 నుండి 10 శాతం పెట్టుబడి ఉంచడం మంచిది.దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కొంచెం ఎక్కువ భద్రతతో ఉండవచ్చు. అలాగే యువ పెట్టుబడిదారులు తక్కువ వాటాను ఇష్టపడతారు, పదవీ విరమణ చేసిన వారు కొంచెం ఎక్కువ రక్షణ కోసం ఉంచవచ్చు.ఇక సురక్షితమైన పెట్టుబడిదారులు 10 శాతం వరకు బంగారాన్ని కలిగి ఉండవచ్చు, మరి దూకుడుగా పెట్టుబడి చేసే వారు 5%తో సంతృప్తి చెందవచ్చు.
ఏదేమైనా.. ఈ దీపావళి, ధంతేరాస్ సీజన్‌లో సమృద్ధిగా కానీ జాగ్రత్తగా బంగారం కొనుగోలు చేయడం పెట్టుబడిదారులకు మంచిది. భౌతిక బంగారం పరిమితంగా, మిగతా మొత్తాన్ని గోల్డ్ ETFలు లేదా ఇతర విలువైన లోహాల్లో పెట్టడం ద్వారా రాబోయే ధరల మార్పులకు భద్రతను పొందవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications