ధనత్రయోదశి, దీపావళి 2025 సమీపిస్తున్న తరుణంలో ప్రతి పెట్టుబడిదారుడి మనస్సులో ఒకే ప్రశ్న మెదులుతోంది. ఇప్పుడే బంగారం కొనాలా లేదా వేచి ఉండాలా?అని.. రికార్డు స్థాయిలో ఉన్న ధరలు, నిపుణుల అంచనాలు, మార్కెట్ అస్థిరతల కారణంగా ఈ ప్రశ్న వారిలో తలెత్తుతోంది. అయితే ఇప్పుడు దీనిపై కీలక నిర్ణయం తీసుకోవడం గతంలో కంటే చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర మొదటిసారి ఔన్సుకు 4 వేల డాలర్లు దాటింది.
దీనికి ప్రధాన కారణాలను మనం చూసినట్లయితే.. సురక్షిత స్వర్గధామ డిమాండ్, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, అమెరికా వడ్డీ రేట్ల కోతలపై అంచనాలు అన్నీ కలిపి భారతదేశంలో బంగారం ధరను రికార్డు స్థాయికి చేరింది. కొన్ని ప్రాంతాల్లో 10 గ్రాములు 1,23,000కి పైగా ట్రేడవుతున్నాయి. ICICI బ్యాంక్ అంచనా ప్రకారం.. 2025 మిగిలిన మూడు నెలల కాలంలో 10 గ్రాములు రూ. 99,500 నుంచి 1,10,000 మధ్య ఉండవచ్చని సూచిస్తున్నారు. అంటే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు. కాబట్టి ఆ ధర వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తోంది.

టాటా మ్యూచువల్ ఫండ్ నివేదిక ప్రకారం, బంగారం ధరలు స్వల్పకాలంలో 3,500 డాలర్ల నుంచి 4,000 డాలర్ల మధ్య స్థిరపడవచ్చని అంచనా. US వాణిజ్య విధానాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక వృద్ధిపై కొనసాగుతున్న ఆందోళనలు దీనికి కారణమని ఫండ్ పేర్కొన్నది. పెట్టుబడిదారులు, చక్రీయ అస్థిరత కారణంగా కొంత తగ్గుదలను కొనుగోలు అవకాశంగా చూడవచ్చు. దీర్ఘకాలికంగా, బంగారం పోర్ట్‌ఫోలియోలో స్ట్రాటజిక్ ఆస్తిగా ఉండటం, ద్రవ్యోల్బణం, భౌగోళిక సమస్యలు, కరెన్సీ తరుగుదలకు వ్యతిరేకంగా హెడ్జ్ గా ఉపయోగపడుతుంది.
నిపుణుల తెలిపిన ప్రకారం.. గత ఏడాదిలో బంగారం 50 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. అయితే, ఇప్పుడు ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నందున సవివరంగా పరిశీలించి పెట్టుబడి పెట్టడం మేలు. స్వల్పకాలంలో ప్రవేశించడం కొంత ప్రమాదకరం, కాబట్టి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి అని ఆప్టిమా మనీ మేనేజర్స్ MD & CEO పంకజ్ మథ్పాల్ ఏం సూచన చేస్తున్నారు.
ఇక యా వెల్త్ గ్లోబల్ డైరెక్టర్ అనుజ్ గుప్తా చెప్పిన వివరాల ప్రకారం.. దీపావళి తర్వాత Gold ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గుదల పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన ధరల్లో కొనుగోలు చేసే అవకాశం ఇస్తుందని తెలిపారు. ధనత్రయోదశి, దీపావళి సమయంలో బంగారం కొనడం సంప్రదాయం, శ్రేయస్సుకు ముడిపడి ఉంటుంది. అధిక ధరలు ఉన్నప్పటికీ, బంగారం విలువను నిలుపుకుంటుందని పిపి జ్యువెలర్స్ డైరెక్టర్ పియూష్ గుప్తా పేర్కొన్నారు.
పోర్ట్‌ఫోలియో వివిధీకరణ కోసం నిపుణులు 5 నుంచి 10 శాతం Gold ఉండేలా సిఫార్సు చేస్తున్నారు. టాటా మ్యూచువల్ ఫండ్ 50:50 గట్టి కేటాయింపుతో బంగారం-వెండి సమతుల్య విధానంను సూచిస్తోంది. దీని వల్ల బంగారం స్ట్రాటజిక్ ఆస్తిగా నిలుస్తూ, వెండి కూడా బలమైన సామర్థ్యాన్ని చూపుతుంది. పండుగలు సాధారణంగా Gold కొనుగోలు డిమాండ్ ను పెంచుతాయి. వివాహాలు, ఆభరణాల అవసరాలు, సాంస్కృతిక సంప్రదాయాలు ధరలకు మద్దతు ఇస్తాయి. 2025లో బంగారం ఇప్పటివరకు 40 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ETF ప్రవాహాలు, కేంద్ర బ్యాంక్ నిల్వలు, మార్కెట్ అనిశ్చితి దీనికి మద్దతు ఇచ్చాయి.
ఏదేమైనా బంగారం ఇప్పుడు కొనుగోలు చేసే సమయమే అయినప్పటికీ కానీ స్వల్పకాలిక ధరల తగ్గుదల కోసం దీపావళి తర్వాత వేచి చూడడం కూడా వ్యూహాత్మకంగా ఉంటుంది. పెట్టుబడిదారులు సంస్కృతి, సంపద, మానవ జీవితానికి బంగారం భద్రతా చిహ్నంగా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications