బంగారం ధర ఈ రేటు వద్దకు వచ్చినప్పుడే సామాన్యులు కొనండి.. లేకుంటే నష్టపోతారంటున్న బ్యాకింగ్ రంగ నిపుణులు
ఈ ఏడాది బంగారం ధరల్లో కొనసాగుతున్న ర్యాలీ పెట్టుబడిదారులకు ఆందోళనతో కూడిన ఉత్సాహం కలిగిస్తూ ఉంది. ఇప్పటివరకు 2025లో బంగారం ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. 2022 నుంచి మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు 140 శాతం పెరిగాయి. నిపుణుల ప్రకారం, ప్రపంచ ఆర్థిక మార్పులు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాలు, ETFలలో బలమైన కొనుగోళ్లు బంగారం ధరల్లో ఊపును కొనసాగిస్తున్నాయి. ఈ ధనత్రయోదశి సందర్భంగా Gold ధరలు 10 గ్రాములకు రూ. 1,30,000 నుంచి 1,50,000 మధ్య ఉండవచ్చని మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది.
సీఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్‌లో కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందన భారతి మాట్లాడుతూ..కేంద్ర బ్యాంకులు, ETFల బలమైన కొనుగోళ్లు ధరలను పెంచుతాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రూ. 1,50,000 కు చేరవచ్చని తెలిపారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ కాంట్రాక్టుకు బంగారం ధరలు ఈ వారం ఇప్పటికే 10 గ్రాములకు రూ. 1,22,284కు చేరాయి. ఇది ప్రపంచ, దేశీయ అంశాల మిశ్రమాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దేశాలు తమ నిల్వలను వైవిధ్యపరుస్తున్నందున, అధికారిక బంగారం కొనుగోళ్లు బహుళ దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరాయి.

ఇక ఎక్విటీ మార్కెట్లలో అస్థిరత, బాండ్ దిగుబడి మధ్య, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) బంగారంపై పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం.. భారత బంగారు ETFలు సెప్టెంబర్ 2025లో 902 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను నమోదు చేశాయి, ఇది ఆగస్టుతో పోలిస్తే 285 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా US, UK, స్విట్జర్లాండ్ తర్వాత, భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది. 17.3 బిలియన్ల డాలర్ల ప్రపంచ పెట్టుబడులకు భారతదేశం గణనీయంగా సహకరించింది. ఈ గ్లోబల్, దేశీయ పరిస్థితులు బంగారం ధరలపై గణనీయ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ధనత్రయోదశి సందర్భంగా పెట్టుబడిదారులు బంగారం కొనుగోలును భద్రతా పెట్టుబడిగా దాన్ని భావిస్తున్నారు. ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశం, కేంద్ర బ్యాంకులు, ETFల కొనుగోళ్లు, అలాగే అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు ఈ సీజన్‌లో బంగారంపై దృష్టి సారిస్తున్నారు.పై పరిస్థితులు బంగారం ధరల్లో ఉత్సాహభరితమైన ర్యాలీ కొనసాగుతుందని, భవిష్యత్తులో రూ.1,50,000 వరకు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే Gold కొనే సామాన్యులు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి ధరలు దిగివచ్చే వరకు ఎదురుచూడాలని చెబుతున్నారు. ఈ ఏడాది చివరి వరకు బంగారం ధరల ర్యాలీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. బంగారాన్ని సామాన్యులు రూ. 1, 19,000 వేల మధ్యకు వచ్చినప్పుడు కొనుగోలు ఆలోచన చేయాలని బ్యాకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు రూ. లక్షా ముప్పై వేలు దాటినప్పుడు మాత్రం దాని జోలికి వెళ్లకూడదని చెబుతున్నారు. కేవలం రూ. లక్షా పందొమ్మిది వేల నుంచి రూ. లక్షా ఇరవై వేల మధ్యలోకి వచ్చినప్పుడు మాత్రమే పసిడి ప్రియులు కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications