బంగారం కొంటే వడ్డీ లాభం.. మోదీ ప్రభుత్వం స్కీమ్..
ప్రభుత్వ స్కీమ్: భారతదేశంలో బంగారం అంటే ప్రజలకు అమితమైన ఇష్టం. అందుకే చిన్న మెుత్తాల్లో అయినా జీవితకాలం వారు గోల్డ్ కొంటూనే ఉంటారు. ఎక్కువ బంగారం కలిగి ఉండటాన్ని గౌరవ ప్రథంగా కూడా భావిస్తుంటారు.
ఈ క్రమంలో వచ్చే వారం ధన్‌తేరస్ పండుగ వస్తోంది. పసిడి ప్రియులు ఈ సమయంలో కనీసం ఒక్క గ్రామైనా బంగారం కొనాలని భావిస్తుంటారు. అందుకే ఎక్కువ మంది ప్రజలు ఈ రోజున భౌతిక బంగారాన్ని కొనుగోలు చేస్తారు. గత కొన్నేళ్లుగా డిజిటల్ బంగారం డిమాండ్ కూడా పెరుగుతోంది. మీరు బంగారంపై డిజిటల్‌గా పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వం నుంచి వడ్డీని కూడా పొందవచ్చు. దీని కోసం బంగారాన్ని ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్(ETF) లేదా సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) మొదలైన వాటి రూపంలో కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం మనం సావరిన్ గోల్డ్ బాండ్ గురించి తెలుసుకుందాం. వీటిలో పెట్టుబడి భద్రతతో పాటు వడ్డీ ఆదాయం కూడా పొందుతారు. దీనిని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సామాన్యులకు అవకాశం కల్పిస్తోంది. స్కీమ్ కింద మీరు ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికోసం రేటును రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది. అలాగే మార్కెట్ రేటు కంటే కొంత డిస్కౌంట్ కూడా అందించబడుతుంది. ఈ బంగారాన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL), NSE, BSE వంటి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఈ బాండ్లు ఎనిమిదేళ్ల కాలానికి జారీ చేయబడతాయి. అయితే పెట్టుబడిదారులు 5వ, 6వ, 7వ సంవత్సరాల్లో నిష్క్రమణ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడిపై ప్రభుత్వం 2.50 శాతం వార్షిక వడ్డీని నిర్ణయించింది. వడ్డీ అర్ధ-వార్షిక వ్యవధిలో చెల్లించబడుతుంది.


Click it and Unblock the Notifications