GoFirst: గో ఫస్ట్‌కు ఎదురుదెబ్బ.. టిక్కెట్ల విక్రయం నిలిపేయాలంటూ డీజీసీఏ ఆదేశాలు..!
GoFirst: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) మే 5న దివాలా తీసిన విమానయాన సంస్థ గోఫస్ట్‌కు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విమాన టిక్కెట్ల విక్రయాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
డబ్బు కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న బడ్జెట్ విమాన సంస్థ విమానాలను నడపటం నిలిపివేసింది. దీనికి తోడు స్వచ్ఛందంగా దివాలా కోసం దాఖలు చేసింది. విమానాలను నడపడంలో విఫలమైన దృష్ట్యా దాని లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నిస్తూ ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఎయిర్‌లైన్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.

దీనిపై బదులిచ్చేందుకు గో ఫస్ట్ విమాన సంస్థకు డీజీసీఏ మే 24 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత GoFirst ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌పై రెగ్యులేటర్ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. "సురక్షితమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన పద్ధతిలో ఆపరేషన్‌లను కొనసాగించడంలో వైఫల్యం" చెందినందున ఎందుకు లైసెన్స్ రద్దు చేయకూడదో వెల్లడించాలని విమాన సంస్థకు పంపిన నోటీసుల్లో కోరింది.
దీనికి ముందు ఎన్సీఎల్టీలో దివాలా పరిష్కారానికి చేసుకున్న దరఖాస్తు దర్యాప్తులో ఉన్నందున విమానాలు సీజ్ కాకుండా ఆర్డర్ పాస్ చేయాలని గో ఫస్ట్ విజ్ఞప్తి చేసింది. అలా చేయటం వల్ల వారం రోజుల్లో తిరిగి విమాన సేవలను ప్రారంభించటానికి తాము ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ సీఈవో వెల్లడించారు. వాడియా గ్రూప్ విమాన సంస్థను నడపే విషయంలో కట్టుబడి ఉందని తెలిపారు. కానీ గత చరిత్రను పరిశీలిస్తే ఒక్కసారి గ్రౌండ్ అయిన ఎయిర్ లైన్ విమానాలు తిరిగి గాల్లోకి ఎగిరిన దాఖదాలు లేవని ఏవియేషన్ నిపుణులు గుర్తుచేస్తున్నారు


Click it and Unblock the Notifications