Aviation News: ఎయిర్‌లైన్ కంపెనీలకు DGCA ఆదేశం.. పిల్లల తల్లిదండ్రులకు శుభవార్త..
Airline News: దేశీయ విమానయాన రంగంలో ఇటీవలి కాలంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విమాన ప్రయాణికుల సౌకర్యం, భద్రతను పర్యవేక్షించే జీడీసీఏ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తప్పులపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా..
12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో విమానంలో ప్రయాణించే తల్లిదండ్రులకు శుభవార్త. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) విమానయాన సంస్థలను 12 ఏళ్లలోపు పిల్లలకు విమాన ప్రయాణ సమయంలో కనీసం వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో ఒకరితో పాటు సీట్లు కేటాయించాలని కోరింది. దీనికి సంబంధించి గతంలో అనేక కేసులు నమోదు కావటంతో డీజీసీఏ రంగంలోకి దిగింది. విమాన ప్రయాణ సమయంలో చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్న చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున తాజా చర్యలు వచ్చాయి.

ఒకే PNRలో ప్రయాణించే 12 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు కనీసం వారి తల్లిదండ్రులు/సంరక్షకుల్లో ఒకరితో సీట్లు కేటాయించబడిందని, వారి రికార్డులను నిర్వహించాలని ఎయిర్‌లైన్ కంపెనీలు నిర్ధారించుకోవాలని డీజీసీఏ పేర్కొంది. దీనితో పాటు విమానయాన సేవలు & ఛార్జీల నియంత్రణ సడలింపుకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్‌ను DGCA సవరించింది.
ప్రిఫరెన్షియల్ సీటు కేటాయింపు, ఆహారం/స్నాక్/పానీయాల ఛార్జీలు, సంగీత వాయిద్యాలను తీసుకెళ్లడానికి ఛార్జీలు వంటి కొన్ని సేవలు నిబంధనల ప్రకారం అనుమతించబడతాయి. ఇలాంటి సేవలను విమానయాన సంస్థలు స్వచ్ఛందంగా అందజేస్తాయని, తప్పనిసరి కాదని డీజీసీఏ పేర్కొంది.
ఏవియేషన్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ BCAS ఇటీవల విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలను ప్రకారం.. ప్రయాణికులు విమానం ఎక్కిన తర్వాత విమానం బయలుదేరడానికి చాలా ఆలస్యం అయితే ప్రయాణికులు ఎయిర్ క్రాఫ్ట్ నిష్ర్కమించేందుకు అనుమతించబడతారని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ప్రజల జీవన శైలి, ఆదాయాలు పెరుగుతున్న క్రమంలో దేశీయ విమాన ట్రాఫిక్ వేగంగా పెరుగుతోంది. ప్రతిరోజూ దాదాపు 3,500 విమానాలు నడపబడుతున్న క్రమంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications