Air India: గతంలో ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగిన ఎయిర్ ఇండియా తన సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటాలు నడుపుతున్న ఈ కంపెనీపై సివిల్ ఏవియేష్ చర్యలు చేపట్టింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) మే-సెప్టెంబర్లలో షెడ్యూల్డ్ డొమెస్టిక్ ఆపరేటర్ల కోసం దిల్లీ, కొచ్చి, బెంగళూరు విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించింది. DGCA నిబంధనల్లో వివరించిన విధంగా ప్రయాణీకుల సౌకర్యాలు, నష్టపరిహారానికి సంబంధించిన బాధ్యతలకు కట్టుబడి ఉండేలా చూసింది. అయితే వీటిని పాటించటంలో ఎయిర్ ఇండియా విఫలమైందని తనిఖీల్లో వెల్లడైంది.

దీని పర్యవసానంగా నియంత్రణ నిబంధనలను పాటించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ నవంబర్ 3న ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసును డీజీసీఏ జారీ చేసింది. ఈ విషయంలో ఎయిర్ ఇండియా ప్రతిస్పందనను సమీక్షించిన తర్వాత.. విమానయాన సంస్థ CAR నిబంధనలను పాటించడంలో విఫలమైందని నిర్ధారించబడింది. ఆలస్యమైన విమానాల వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు హోటల్ వసతి లేకపోవడం, కొంతమంది గ్రౌండ్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం, సర్వీస్ చేయలేని సీట్లలో ప్రయాణించవలసి వచ్చిన అంతర్జాతీయ వ్యాపార తరగతి ప్రయాణికులకు పరిహారం చెల్లించడంలో వైఫల్యం వంటివి ఇందులో ఉన్నాయి.
ఇలా ఎయిర్ ఇండియా నిర్వహణలో డీజీసీఏ గమనించిన నిబంధనల ఉల్లంఘనపై చర్యలకు ఉపక్రమించింది. దీంతో క్యారియర్‌పై రూ.10 లక్షల జరిమానా విధించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications