స్పైస్‌జెట్‌కు షాక్: ఆ లైసెన్స్ రద్దు చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ: దేశీయ పౌర విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు షాక్ తగిలింది. లో కాస్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇది. హర్యానాలోని గుర్‌గావ్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రమాదకర సరుకులను తరలించే విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండే విభాగం ఇది. ప్రమాదకరమైన సరుకులను రవాణా చేసే విషయంలో స్పైస్‌జెట్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది.
ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు నెలరోజుల పాటు అమల్లో ఉంటాయి. ప్రమాదకర సరుకులను రవాణా చేయడానికి ఉద్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను స్పైస్‌జెట్ యాజమాన్యం ఉల్లంఘించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు డీజీసీఏ అధికారులు. ఈ సందర్భంగా స్పైస్‌జెట్ యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి నెలరోజుల పాటు స్పైస్‌జెట్ విమాన సర్వీసుల్లో ప్రమాదకరమైన వస్తువులు, పదార్థాలను రవాణా చేయడం కుదరదు. లిథియం-అయాన్ బ్యాటరీలను కూడా ఈ ప్రమాదకర వస్తువుల జాబితాలోకి చేర్చారు డీజీసీఏ అధికారులు. డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో కూడా ప్రమాదకరమైన వస్తువులను తరలించడాన్ని తాత్కాలికంగా నిషేధించారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులనూ ఈ లిస్ట్‌లో చేర్చారు.
డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత, వారి లగేజీ లేదా ప్రాపర్టీ, పర్యావరణానికి హాని కలిగించని విధంగా ప్రమాదకర వస్తువులను రవాణా చేయడానికి అనుమతి ఉంది. అన్ని దేశీయ పౌర విమానయాన సంస్థలకు కూడా ఈ నిబంధనలు, మార్గదర్శకాలు వర్తిస్తాయి. సరుకులను ప్యాకేజ్ చేసిన అనంతరం నాన్ డేంజరస్ గూడ్స్ అనే డిక్లరేషన్‌ను వాటి సంబంధీకులు ఇవ్వాల్సి ఉంటుంది.
డేంజరస్ గూడ్స్‌ను ప్యాక్ చేసిన తరువాత.. దాన్ని పొరపాటున నాన్ డేంజరస్ గూడ్స్‌గా డిక్లేర్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు స్పైస్‌జెట్ యాజమాన్యం తెలిపింది. దీనిపై తన స్పందనను తెలియజేయడానికి స్పైస్‌జెట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అజయ్ సింగ్ అందుబాటులో లేరు. తాత్కాలికంగా నిషేధం విధించిన విషయాన్ని డీజీసీఏ అధికారి అరుణ్ కుమార్ ధృవీకరించారు. నెలరోజుల పాటు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications