Akasa Air: రాకేష్ జున్‌జున్‌వాలా కుటుంబం నడిపిస్తున్న ఆకాశ విమానయాన సంస్థ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆ స్థాయిలో ఫలించటం లేదు.
అకస్మాత్తుగా 43 మంది పైలట్లు కంపెనీని వీడటంతో ఆకాశ దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనిపై కంపెనీ ఇప్పటికే చట్టపరమైన చర్యలకు దిగింది. ఈ క్రమంలో పైలట్లు అకస్మాత్తుగా వైదొలిగినప్పుడు నిష్క్రియాత్మకంగా వ్యవహరించారంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)పై ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన డీజీసీఏ తాము పార్టీల మధ్య వివదాల్లో జోక్యం చేసుకోమంటూ తోసిపుచ్చింది.

విమానయాన సంస్థ లీగల్ ఫైలింగ్స్ లో డీజీసీఏ జోక్యం చేసుకోకపోవడం వల్ల ఎయిర్‌లైన్‌కు "గణనీయమైన ఆర్థిక, నిర్వహణ కష్టాలు" ఏర్పడ్డాయని పేర్కొంది. దీనికి తాజాగా రెగ్యులేటరీ అథారిటీ బదులిచ్చింది. నిబంధనల ప్రకారం పైలట్లు ఒప్పందం ప్రకారం నోటీసు వ్యవధిని పూర్తి చేసుకున్న తర్వాతే ఇతర కంపెనీల్లో ఉద్యోగానికి మారాల్సి ఉంటుంది. కానీ ఆకాశ విషయంలో అలా జరగలేదు. దీంతో సదరు పైలట్ల చర్యలను సవాలు చేస్తూ కంపెనీ కోర్టులో దావా వేసింది.
డీజీసీఏ సెప్టెంబర్ 22న దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ఫైలింగ్‌లో రెగ్యులేటర్ ఈ విషయంలో జోక్యం చేసుకోలేనందున ఆకాశ ఎయిర్ అభ్యర్థనను తోసిపుచ్చాలని పేర్కొంది. DGCAకి "ఏదైనా ఉపాధి ఒప్పందంలో జోక్యం చేసుకునే అధికారం లేదా ప్రతినిధి అధికారం తమకు లేదు" అని పేర్కొంది. పైలట్ రాజీనామాల కారణంగా ఆగస్టులో 630 విమాన సేవలను రద్దు చేసింది.
ఆగస్ట్‌లో ఆకాశ ఎయిర్‌కు చెందిన 1.17 శాతం విమానాలు మాత్రమే రద్దు అయ్యాయి. ఆకాశ ఎయిర్ విమానాల రద్దు నంబర్లు నిరాధారమైనవని, ఈ వివాదంలో DGCA జోక్యం చేసుకోదని భారత పైలట్ల సమాఖ్య తెలిపింది. సామూహిక రాజీనామాలు ఉద్యోగుల అసంతృప్తికి నిదర్శనమని పేర్కొంది.


Click it and Unblock the Notifications