AI ఉద్యోగ మార్కెట్‌ను, వృత్తుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్న శక్తివంతమైన మార్పు. భారత దేశంలోని లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఈ మార్పులో భాగమై ఉండాలంటే వారు కొత్త టెక్నాలజీలతో పాటు కొత్త దృక్పథాన్ని కూడా అలవరుచుకోవాలి.

నాస్కామ్ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్ ఇలా చెప్తున్నారు "AI వృద్ధితో చాలా సంస్థలు తమ సేవా మోడళ్లను ప్రోడక్ట్ ఆధారితంగా మార్చుకుంటున్నాయి. 2022 నాటికి భారత్‌లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో పనిచేయగల నిపుణుల సంఖ్య 4.25 లక్షల మందే ఉండగా, ఆ సమయానికి డిమాండ్ మాత్రం 6 నుంచి 6.5 లక్షల మధ్య ఉంది. అంటే అవసరానికి తక్కువ మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు.
ఇప్పుడు చూస్తే, 2027 నాటికి ఈ డిమాండ్ 13 లక్షలకు పెరిగే అవకాశముంది. అంటే AI రంగంలో పని చేయగలవాళ్ల కోసం భారీగా అవకాశాలు వస్తున్నాయి.,అందుకే, ఉద్యోగులు తమ నైపుణ్యాలను కొత్తగా నేర్చుకోవడం (రీ-స్కిలింగ్), ఇతర రంగాల నైపుణ్యాలను కూడా కలుపుకోవడం (క్రాస్-స్కిలింగ్), చదువు పూర్తైన తర్వాత కూడా నిరంతరం నేర్చుకుంటుండటం (లైఫ్‌లాంగ్ లెర్నింగ్) చాలా అవసరం అవుతుంది. AI యుగంలో ఇది తప్పనిసరి మారింది.
హ్యూమన్ రిసోర్స్ విధానాల్లో మలుపు:
డెల్ కంపెనీలో ఉన్న రమేశ్ జంపుల తెలిపినట్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మన ఉద్యోగాలను తీసుకోడం లేదు కానీ అవి ఎలా ఉంటాయో, ఎలా చేయాలో తాజా అర్థాన్ని ఇస్తోంది అంటే ఉద్యోగాల స్వభావం మారిపోతోంది. అందుకే IT రంగంలో ఉన్న వారు తమను తాము కొత్తగా తీర్చిదిద్దుకోవాలి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, AI మోడల్స్ ట్రైనింగ్, క్లౌడ్-నేటివ్ డెవలప్‌మెంట్ లాంటి నూతన నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఇవి కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, బహుళ విభాగాలతో కలిసి పనిచేసే నైపుణ్యాలు కూడా ఉండాలి. ఇవన్నీ కలిగిన వారు AI యుగంలో తమ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు.
AI వల్ల కొత్త అవకాశాలూ పుట్టుతున్నాయి:
NIIT డిజిటల్ బిజినెస్ హెడ్ అంషుమాన్ ప్రసాద్ ప్రకారం "AI కారణంగా ప్రోగ్రామింగ్ లో రొటీన్ పనులు ఆటోమేట్ అవుతున్నా, అదే సమయంలో కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయి. AI/ML, సైబర్ సెక్యూరిటీ, డెవ్‌ఒప్స్, క్లౌడ్ టెక్నాలజీ, డేటా ఇంజినీరింగ్ వంటి రంగాల్లో భారీ డిమాండ్ పెరుగుతోంది."
పబ్లిసిస్ సాపియెంట్ కంపెనీలో CPO షెఫాలీ శర్మ గార్గ్ చెబుతున్నట్లు "AI కారణంగా డెవలపర్ పాత్ర మారిపోతోంది. కానీ ఇది అంతం కాదు ఓ కొత్త రూపం ఇస్తోంది. అభ్యాసంలో మన వేగం, ఆత్మవిశ్వాసం, సరికొత్త టూల్స్‌ను స్వీకరించే ధైర్యమే మన విజయాన్ని నిర్ణయిస్తుంది." ఆ సంస్థ Slingshot అనే టూల్‌తో ఉద్యోగుల నైపుణ్యాల్ని మెరుగుపరుస్తోంది.
విద్యా వ్యవస్థపై ప్రభావం:
ISB ఇనిస్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్‌కు చెందిన మధు విశ్వనాథన్ మాట్లాడుతూ ఇది కేవలం టూల్స్ నేర్చుకునే సమస్య కాదు. వాటిని ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం. సమస్య పరిష్కార దృక్పథం, ప్రోడక్ట్ థింకింగ్ అవసరం. ఇవి సాధించాలంటే విద్యా విధానమే మారాలి.
AI, క్లౌడ్, డేటా వంటివి ఇకపై అదనపు విషయంలో కాకుండా, ప్రతి కోర్సులో ముఖ్యమైన భాగంగా ఉండాలి. టెక్నాలజీ రంగంలో ఉన్నవాళ్లు ఇవి తప్పనిసరిగా నేర్చుకోవాలి. అలాగే, AI ఆధారిత కంపెనీలు, వ్యవసాయ టెక్నాలజీ (అగ్రిటెక్), చిన్న, మధ్య తరహా పరిశ్రమల టెక్ (MSME టెక్), ఆరోగ్య టెక్నాలజీ (హెల్త్ టెక్) లాంటి రంగాల్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఇంకా పూర్తిగా వాడబడలేదు కాబట్టి, ఈ రంగాల్లో పనిచేసేందుకు డెవలపర్లు సిద్ధం కావాలి.
AI వలన డెవలపర్ ఉద్యోగం పోతుందని అనుకోవడం తప్పు. నిజంగా చూస్తే, ఈ ఉద్యోగం ఇంకా ముఖ్యమైనదిగా మారుతోంది అంటే సాధారణ కోడింగ్ కంటే ఎక్కువగా ఆలోచన, సమస్యల పరిష్కారం, కొత్త ఆవిష్కరణలు అవసరం అవుతాయి. మార్పు వస్తే భయపడకుండా, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లగలిగితే - భారతీయ డెవలపర్ మళ్లీ ప్రపంచంలో పేరు తెచ్చుకోవచ్చు. AI మనకు పోటీ కాదు, మన పనిలో తోడుగా ఉండే సహాయకుడు.


Click it and Unblock the Notifications