IPO Multibagger: ఐపీవోగా వచ్చింది.. అదరగొడుతున్న మల్టీబ్యాగర్.. మెగా రిటర్న్స్
IPO Multibagger: దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Dev IT) ఐపీవోగా అరంగేట్రం చేసిననాటి నుంచి స్టాక్ మార్కెట్లో అదరగొడుతోంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. దాదాపుగా ఇన్వెస్టర్లకు 465% తన ఇష్యూ తర్వాత అందించింది. ఏడాది ప్రాతిపదికన ఈ ఎస్ఎమ్ఈ స్టాక్ 2022లో ఊహించని రాబడులను అందించింది

బలమైన రాబడులు..
2022లో స్టాక్ ధర రూ.133 నుంచి రూ.237 స్థాయికి పెరిగింది. అయితే ఈ స్మాల్ క్యాప్ స్టాక్ నేడు ఎక్స్-స్ల్పిట్ ట్రేడ్ చేయబోతున్నందున ఫోకస్ స్టాక్‌లలో ఒకటిగా ఉంది. నవంబర్ 25ను కంపెనీ బోర్డు షేర్లను 1:2 నిష్పత్తిలో స్ల్పిట్ చేసేందుకు రికార్డు తేదీగా నిర్ణయించింది. ఇదే విషయాన్ని కంపెనీ సెబీకి అందించిన వివరాల్లో గతంలో తెలిపింది. ప్రస్తుతం షేర్ ఫేస్ వ్యాల్యూ రూ.10గా ఉంది.

స్టాక్ ధర హిస్టరీ..
దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2017లో ఐపీవోగా మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో ఒక్కో ఈక్విటీ షేర్ ధర రూ.42గా ఉంది. ఆ తర్వాత కంపెనీ తన పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. అప్పట్లో రూ.50.40 వద్ద ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన స్టాక్ ధర ఈ రోజు 17.15 శాతం పెరిగి రూ.139.75 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.153 కోట్లుగా ఉంది. అప్పట్లో ఒక్క లాట్ షేర్లను రూ.1.26 లక్షలు పెట్టి కొని ఉంటే ప్రస్తుతం దాని విలువ దాదాపు రూ.7.12 లక్షల కంటే ఎక్కువకు చేరుకుంది.

కంపెనీ వ్యాపారం..
గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఐటీ సేవల కంపెనీ 1997లో ప్రారంభించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టెక్ కంపెనీలతో కలిసి సంస్థ పనిచేస్తోంది. కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో ప్రముఖ IT ఎనేబుల్డ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా విశ్వసించబడుతోంది. ఎంటర్‌ప్రైజ్ అనుకూల అప్లికేషన్ డెవలప్‌మెంట్ సేవలతో కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించింది. కంపెనీ 947 మంది ఉద్యోగులను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications