జర్మనీకి చెందిన ప్రఖ్యాత అంతర్జాతీయ బ్యాంక్ Deutsche Bank.. భారత్‌లో తన రిటైల్, సంపద నిర్వహణ (వెల్త్ మేనేజ్మెంట్) వ్యాపారం నుంచి పూర్తిగా నిష్క్రమించేందుకు రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లాభదాయకతను పెంచాలనే లక్ష్యంతో సంస్థ చేపట్టిన పెద్ద పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా.. భారతీయ మార్కెట్‌లో రిటైల్ విభాగం బ్యాంక్‌కు ఇక లాభసాటిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్లలో ఇది రెండోసారి డ్యూయిష్ బ్యాంక్ ఇలాంటి విక్రయం గురించి ఆలోచించడం.. భారత రిటైల్ బ్యాంకింగ్ రంగంలో విదేశీ బ్యాంకులు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను ఇది స్పష్టంగా చూపించినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
డ్యూయిష్ బ్యాంక్ ఇప్పుడు విక్రయించదలచిన వ్యాపారం చిన్న భాగమేమి కాదు. ఇందులో వ్యక్తిగత రుణాలు, కొన్ని మోర్ట్గేజ్ లేదా తనఖా రుణాలు, అలాగే సుమారు రూ.25 వేల కోట్ల ఆస్తులను నిర్వహించే వెల్త్ మేనేజ్మెంట్ విభాగం ఉన్నాయి. మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ రిటైల్ విభాగం రూ.2,455 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఆదాయంతో పోలిస్తే సుమారు 4 శాతం ఎక్కువ. తాజా డేటా ప్రకారం, రిటైల్ బ్యాంకింగ్ ఆస్తుల మొత్తం విలువ రూ. 25,038 కోట్లుగా ఉన్నాయి.

ఈ భారీ పోర్ట్‌ఫోలియోపై భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఆసక్తి చూపుతున్నాయి. ఇరు బ్యాంకులు ఈ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోను పరిశీలించాయి. ఇప్పుడు డీల్ ధర మీద చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కానీ ఎవరూ అధికారికంగా వ్యాఖ్యానించేందుకు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది పరిశ్రమలో పెద్ద డీల్‌గా మారే అవకాశం ఉంది. డ్యూయిష్ బ్యాంక్ కూడా ఇప్పటివరకు అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు. అయితే అంతర్గత వర్గాలు మాత్రం చర్చలు ముందుకు సాగుతున్నాయని చెబుతున్నాయి.
భారతదేశంలో విదేశీ బ్యాంకులు పెద్దమొత్తంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటిలో ముఖ్యమైనవి పెద్ద భారతీయ బ్యాంకుల నుండి వచ్చే కఠినమైన పోటీ, అధిక ఖర్చులు, తక్కువ బ్రాంచ్ నెట్‌వర్క్, డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో స్థానిక బ్యాంకులు సాధించిన వేగవంతమైన ఎదుగుదల. ఈ పరిస్థితుల కారణంగా గత కొన్నేళ్లలో అనేక విదేశీ బ్యాంకులు భారత రిటైల్ మార్కెట్ నుండి నిష్క్రమించాయి. 2022లో సిటీబ్యాంక్ తన క్రెడిట్ కార్డ్, రిటైల్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్‌కు విక్రయించింది. అదే ఏడాది కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుండి రూ. 3,330 కోట్ల వ్యక్తిగత రుణ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసింది.
ఇప్పుడు డ్యూయిష్ బ్యాంక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంలో కోటక్, ఫెడరల్ బ్యాంక్‌లు చూపుతున్న ఆసక్తికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ డీల్ పూర్తయ్యే పక్షంలో ఇరు బ్యాంకులకు ఒక పెద్ద కస్టమర్ బేస్‌ను తక్షణమే పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో ఉన్న అధిక విలువ గల కస్టమర్లు రెండు బ్యాంకులకూ అమూల్యమైన ఆస్తి. ఇది వీరి రిటైల్ బ్యాంకింగ్, ప్రీమియం బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారాలను విస్తరించడంలో మిన్నగా చెప్పవచ్చు.
ఈ డీల్ విజయవంతమైతే భారత రిటైల్ బ్యాంకింగ్ రంగంలో మరోసారి పెద్ద మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పటికే ఆగ్రెసివ్ గానే విస్తరిస్తుండగా, ఫెడరల్ బ్యాంక్ కూడా దేశవ్యాప్తంగా తన ఉనికిని బలపర్చే ప్రయత్నంలో ఉంది. అందువల్ల డ్యూయిష్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయడం వీరి వ్యాపార వ్యూహాలకు మరింత పదునుగా మారుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications