ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్‌తో ధనసంజయ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాలసీదారు ప్లాన్ అమల్లో ఉన్నప్పుడు మరణిస్తే గ్యారెంటీడ్ టెర్మినల్ బెనిఫిట్ నామినీలకు అందించడంతో పాటు ఇతరులకు మెచ్యూరిటీపై గ్యారెంటీడ్ ఆదాయ బెనిఫిట్ చెల్లిస్తుంది.
భద్రత, సేవింగ్స్ ప్రయోజనాలతో దీనిని తీసుకు వచ్చింది ఎల్ఐసీ. కచ్చితమైన ఆదాయ, టర్మినల్ లాభాలున్నాయి. కనీసం అయిదేళ్ల, గరిష్టంగా పదిహేనేళ్లు ఈ ప్లాన్ కాలపరిమితి. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా కూడా ఈ ప్లాన్ అండగా ఉంటుంది. ఈ ప్లాన్ కింద మినిమం సమ్ అస్యూర్డ్ రూ.2.5 లక్షల నుండి రూ.22 లక్షలు. ప్రీమియంకు సంబంధించి పరిమితి లేదు. డెత్ బెనిఫిట్ సొమ్మును ఏకమొత్తంలో లేదా ఐదు వార్షిక వాయిదాలలో చెల్లిస్తారు.

మూడేళ్లు నిండిన వారు ఎవరైనా పాలసీని తీసుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయం ఉంది. ఆఫ్ లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్లాన్ కాలపరిమితి కనిష్టం అయిదేళ్లు, గరిష్టం 15 ఏళ్లు. లెవెల్ ఇన్‌కం బెనిఫిట్, ఇంక్రీజింగ్ ఇన్‌కం బెనిఫిట్, సింగిల్ ప్రీమియం లెవల్ ఇన్‌కం బెనిఫిట్, లెవల్ ఇన్‌కం బెనిఫిట్‌తో కూడిన సింగిల్ ప్రీమియంలలో పాలసీదారులు సౌకర్యాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications