ప్రపంచ నాలుగో కుబేరుడు బిల్ గేట్స్-మెలిందా గేట్స్ విడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారి సంపాదన పంపకంపై చర్చ సాగుతోంది. వీరి సంపద వ్యాల్యూ 145 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అంటే భారత కరెన్సీలోరూ.11 లక్షల కోట్లు. గతంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు జరిగిన ఆస్తి పంపకాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బెజోస్ తన ఆస్తిలో 75 శాతం వాటాను తన వద్ద అట్టిపెట్టుకొని 25 శాతం మెకంజీకి ఇచ్చారు. అమెజాన్‌లోని ఉమ్మడి వాటా నుండి 16 శాతం మెకంజీకి వాటాగా వచ్చింది. దీంతో ఆమె ప్రపంచ నాలుగో సంపన్న మహిళగా నిలిచారు.

ఫౌండేషన్‌కే ఎక్కువ వాటా
ఇప్పుడు గేట్స్ దంపతుల డైవోర్స్ పంపకాలు అంత ఈజీగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. బెజోస్ తరహాలో పెట్టుబడులన్నీ ఒకచోట లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పైగా ప్రపంచంలోని అతిపెద్ద ఫౌండేషన్లలో ఒకటైన గేట్స్ ఫౌండేషన్‌కు ఇద్దరు కలిసి నేతృత్వం వహిస్తున్నారు. దంపతులుగా విడిపోయినా ఫౌండేషన్ కోసం కలిసి పని చేస్తామని వారు వెల్లడించారు. ఆస్తిలో ఎక్కువ వాటా ఫౌండేషన్‌కే వెళ్తుంది.

పిల్లలకు నామమాత్రమే
ప్రస్తుతం 1.8 బిలియన్ డాలర్ల(రూ.13,500 కోట్లు) షేర్లు మెలిందా పేర బదలీ అయినట్లు తెలుస్తోంది. గేట్స్ దంపతులు వాషింగ్టన్‌లో తమ ఎస్టేట్‌లో నివసిస్తున్నారు. ఈ ఎస్టేట్ విస్తీర్ణం 66 వేల చదరపు అడుగులు. వాషింగ్టన్ చట్టాల ప్రకారం ఇల్లు మాత్రం భార్యాభర్తలు విడిపోతే చెరి సగం పంచుకోవాలి. తమ ముగ్గురు పిల్లలకు ఆస్తిలో వాటా నామమాత్రమే ఇస్తామని బిల్ గేట్స్ ఇదివరకు ప్రకటించారు.

27 సంవత్సరాల తర్వాత విడిపోతున్నారు
బిల్ గేట్స్, మెలిందా 27 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత విడిపోవడానికి గల కారణాలు ఏమిటనే చర్చ సాగుతోంది. బిల్ గేట్స్ ప్రపంచంలోని కుబేరుల్లో 4వ స్థానంలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చేరిన గేట్స్, మధ్యలోనే చదువును ఆపేశారు. ఆ తర్వాత 1975లో పాఠశాల స్నేహితుడు పాల్ అలెన్‌తో కలిసి టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ 1986లో IPOకు వచ్చింది. ఆ సమయంలో గేట్స్‌కు మైక్రోసాఫ్ట్‌లో 49 శాతం వాటా ఉంది. ఐపీఓకు మంచి స్పందన రావడంతో కుబేరుడయ్యాడు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications