Advit Jewels IPO: అద్విత్ జువెల్స్ ఐపీఓకు భారీ డిమాండ్.. 50 శాతం పెరిగిన జీఎంపీ..!
నగల తయారీ, అమ్మకాల కంపెనీ అద్విత్ జువెల్స్ కంపెనీ ఐపీఓ ఈ రోజు ఓపెన్ అయింది. 25న ముగుస్తుంది. జూన్ 29 షేర్ల కేటాయింపు ఉండగా.. రీఫండ్, షేర్ల జమ జూన్ 30న జరుగుతుంది. జూలై 1న అద్విత్ జ్యువెలర్స్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నాయి. కాగా ఒక్కో షేరు ధరను రూ.130 నుంచి రూ.138 గా నిర్ణయించారు. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే కనీసం ఒక లాట్ అయిన కొనుగోలు చేయాలి. ఒక్క లాట్ కు రూ. 13,800 పెట్టుబడి పెట్టాలి. ఒక లాట్ లో 100 షేర్లు ఉంటాయి. జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఆభరణాల తయారీ సంస్థ, కొత్త ఈక్విటీ షార్ల జారీ ద్వారా రూ.165.16 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 49.52 కోట్లను సమీకరించింది. ఇందులో మ్యూచువల్ ఫండ్లు కూడా ఉన్నాయి.
ఈ ఐపీఓకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఐపీఓ ఇప్పటికే పూర్తిగా సబ్స్క్రిప్షన్ అయింది. ఈ కంపెనీపై బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అద్విత్ జువెల్స్ ను 2019లో స్థాపించారు. ఈ కంపెనీ రాంభాజో అనే బ్రాండ్ తో చేతితో తయారు చేసిన కుందన్, పోల్కి, వజ్రాలు, స్టడెడ్ ఆభరణాలు విక్రయిస్తుంది. అద్విత్ జువెల్స్ ఎక్కువగా బీ2బీ(బిజినెస్ టూ బిజినెస్) వ్యాపారం చేస్తోంది. ఆర్డర్‌పై ప్రత్యేకంగా తయారుచేసే ఆభరణాల ద్వారా B2C(బిజినెస్ టూ కస్టమర్) వినియోగదారులకు కూడా సేవలు అందిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు బాగుండడంతో పాటు త్వరలోనే పెద్ద ఐపీఓలు అయిన జియో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వస్తుండడంతో అందరి దృష్టి ఐపీఓలపై పడింది. ఈ నేపథ్యంలోనే అద్విత్ జువెల్స్ భారీగా డిమాండ్ కనిపిస్తుంది. మొదటి రోజు 9.38 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఇందులో క్వాలిఫైడ్ ఇనిస్టుషనల్ బయ్యర్స్ 1.09 రెట్లు, నాన్ ఇనిస్టుషనల్ ఇన్వెస్టర్స్ 18.37 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్స్ 10.27 రెట్లు సబ్స్రైబ్ అయింది. ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
గ్రే మార్కెట్ ప్రీమియంలో అద్విత్ జువెల్స్ షేర్లు ఒక్కొక్కటి రూ.201 వద్ద ట్రేడవుతున్నాయి. ఐపీఓ ప్రైస్ రూ.138తో పోలిస్తే గ్రే మార్కెట్ ప్రీమియం 45.65 శాతం ఎక్కువగా ఉంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఈక్విటీ మార్కెట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీలు ఐపీఓలు తీసుకోస్తున్నాయి. పెట్టుబడిదారులు కూడా ఐపీఓలకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఐపీఓకు దరఖాస్తు చేసే ముందు కంపెనీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గ్రే మార్కెట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications