Fitment Factor: ప్రధాని మోదీ కొన్ని వారాల కిందట 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి చేసిన ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు మంచి రోజులు వచ్చాయి. 2016లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన 7వ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ 31, 2025న ముగియనున్న వేళ ఉద్యోగులు కొత్త వేతన సంఘం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘం అమలు వల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో వేతనాలు, అలవెన్సులతో పాటు ఇతర ప్రయోజనాల సవరించటం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ 2026 నాటికి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు ప్రకటన చేయటం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని ఉరకలు వేయించింది. ఈ క్రమంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 2.86కు పెంచే అవకాశం ఉందనే అంచనాలు సైతం ఉద్యోగుల్లో కొనసాగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుల గురించి చర్చలు కొనసాగుతున్న వేళ నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ కనీసం 2.57 లేదా అంతకంటే ఎక్కువ ఫిట్‌మెంట్ అందించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్(JCM-NC) మెషినరీ కార్యదర్శి (స్టాఫ్ సైడ్) శివ గోపాల్ మిశ్రా తెలిపారు. ఒకవేళ కోరిక మేరకు 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అందిస్తే ఉద్యోగుల వేతనాలు ఏకంగా 157 శాతం పెరుగుతాయని వెల్లడైంది. ఉదాహరణకు కనీసం రూ.18 వేలు వేతనంగా పొందే ఉద్యోగి జీతం రూ.46,260కి చేరుకుంటుంది.
ఇదే ఇదే 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం నుంచి రూ.9000 పెన్షన్ అందుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రూ.23,130 పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో 7వ వేతన సంఘం కూడా ఇదే ఫిట్మెంట్ కారకాన్ని అందించింది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 8వ వేతన సంఘం కింద 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్ వినిపించేది. కానీ అది నింగిలోని చంద్రుడిని కోరుకోవటం లాంటిదని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన దీనిని 1.92 వద్ద ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
8వ వేతన సంఘం కనీసం 2.57 లేదా అంతకంటే ఎక్కువ ఫిట్‌మెంట్ కారకాన్ని ఎందుకు JCM-NC కోరుతుందనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వం ఫాలో అవుతున్న డాక్టర్ అక్రాయిడ్ సూత్రం చాలా పాతదని, ప్రస్తుతం ఉద్యోగుల అవసరాలను ప్రతిబింబించేలా కొలమానాలు లేవని శివ గోపాల్ మిశ్రా చెబుతున్నారు. 20వ శతాబ్దంలో అభివృద్ధి చేయబడిన డాక్టర్ అక్రాయిడ్ సూత్రం, నిత్యావసర వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకుంటుంది కానీ ఇంటర్నెట్ ఖర్చుల వంటి ఆధునిక ఖర్చులను పట్టించుకోదని ఉదహరించారు. ఉద్యోగులకు ప్రస్తుత కాలంలో గౌరవప్రదమైన జీవితాన్ని అందించటానికి పాత పద్దతులను మార్చాలని వారు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications