IT News: డెలాయిట్ కిల్లింగ్ ప్లాన్.. లేఆఫ్స్ తగ్గించేందుకు AI వినియోగం.. పాపం ఫ్రెషర్స్!
Layoffs: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల చిన్న కంపెనీల నుంచి దిగ్గజ సంస్థల వరకు ఉద్యోగులపై వేటు వేయాల్సి వచ్చింది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ రెండింటినీ మిక్స్ చేసి మంచి ఫలితాలు రాబట్టవచ్చంటూ డెలాయిట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల లేఆఫ్స్ కు చెక్ పట్టవచ్చని కన్సల్టింగ్ దిగ్గజం డెలాయిట్ భావిస్తోంది. వేలాది మంది గ్రాడ్యుయేట్‌లను నియమించుకున్న అనంతరం కూడా వందల మంది సిబ్బందిని తొలగించడం సరికాదని అభిప్రాయపడుతోంది. ఈ అంతరాన్ని పూరించడానికి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు చెప్తోంది.

తన సిబ్బందిలోని వివిధ నైపుణ్యాలను అంచనా వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తోంది. తద్వారా మ్యాప్ అవుట్ ప్లాన్లను రూపొందించాలని ప్రయత్నిస్తోంది. తద్వారా సిబ్బందిని తన వ్యాపార అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పాత్రల్లోకి మార్చవచ్చని భావిస్తోంది.
కాలక్రమేణా నియామక వృద్ధిని తగ్గించడానికి ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. ఈ ఏడాది డెలాయిట్ లక్షా 30 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది. అయితే ఇదే సమయంలో డిమాండ్ మందగించడంతో వందలాది ఉద్యోగులు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని గుర్తించింది. కొత్తగా సిబ్బందిని నియమించుకుని అనుభవజ్ఞులను వదిలించుకోవడం కంటే.. AI సహాయంతో వారి నైపుణ్యాలను గుర్తించి తదనుగుణంగా ఇతర విభాగాల్లోకి తరలించాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ గ్లోబల్ చీఫ్ టాలెంట్ ఆఫీసర్ స్టీవన్ రోల్స్ తెలిపారు.


Click it and Unblock the Notifications