Salary hikes: వరుస లేఆఫ్స్, వేతనాల కోతలతో కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో భవిష్యత్తుపై బెంగతో పలువురు ఈ తరహా ఉద్యోగాలను వదిలి సొంత వ్యాపారం లేదా ఊళ్లో వ్యవసాయం చేసుకునేందుకు పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ గుడ్‌న్యూస్ చెప్పింది.
కార్పొరేట్ కంపెనీలు ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు బాగానే పెంచుతాయని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. టాప్ పెర్ఫార్మ్ చేసిన కంపెనీలు సగటు రేటింగ్ ఉన్న ఉద్యోగులకు 1.8 రెట్లు మేర ఇంక్రిమెంట్లు ఇవ్వవచ్చని పేర్కొంది. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్‌కు యావరేజ్ గా 9 శాతం వేతనాల పెంపు ఉండబోతోందని వెల్లడించింది. ఈ మేరకు 'డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్‌లుక్ 2024' పేరిట ఓ నివేదిక విడుదల చేసింది.

కొవిడ్ మహమ్మారి విజృంభణకు ముందుతో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని రంగాల్లో ఇంక్రిమెంట్లు బావుంటాయని తేల్చి చెప్పింది. అయితే గత ఏడాది అంచనా వేసిన 9.2 కంటే ఈ దఫా వేతన పెంపు కొంత తక్కువగా ఉండటం గమనార్హం. కాగా ఇందులో IT మరియు BPOలకు మినహాయింపు ఇవ్వడం కొసమెరుపు.
జూనియర్ మేనేజ్‌మెంట్ కు రెండంకెల హైక్ లభించనుందని డెలాయిట్ అభిప్రాయపడింది. అయితే ఆయా సంస్థలు తమ బెల్‌కర్వులో కొంత కఠినంగా వ్యవహరించవచ్చని స్పష్టం చేసింది. తద్వారా టాప్ రేటింగ్స్ పొందడం కష్టమవుతుందని హెచ్చరించింది. కానీ సగటు కంటే తక్కువ రేటింగ్ ఉన్న ఉద్యోగులకు గతేడాది 0.6 రెట్లు హైక్ రాగా ఇప్పుడది 0.4 రెట్లకు తగ్గుతుందని వివరించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications