Jobs: వేలాది కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఈ సమయంలో దిగ్గజ కంపెనీ డెలాయిట్ తీసుకున్న నిర్ణయం జాబ్ మార్కెట్‌కు కొంత పాజిటివ్‌గా కనిపిస్తోంది. కష్టకాలంలో ఉన్న నిరుద్యోగులకు వరంలా మారనుంది.
ప్రముఖ కన్సల్టింగ్ మరియు ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ డెలాయిట్ తన కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని, మెరుగుపరచాలని భావిస్తోంది. కస్టమర్‌లతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లోని 3 ప్రాంతాల్లో కొత్త ఆఫీస్‌లు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

బెంగళూరు, నోయిడా మరియు పూణేలలో ఈ కొత్త కార్యాలయాలు కొలువుదీరనున్నట్లు కంపెనీ సౌత్ ఏషియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నితిన్ కిని లింక్డ్‌ఇన్ ద్వారా తెలియజేశారు. 'ఈ ఆఫీసులు మమ్మల్ని ప్రజలకు మరియు క్లయింట్‌లకు మరింత దగ్గర చేస్తాయి. డెలాయిట్ నిపుణుల శక్తిని మరియు ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి' అని పేర్కొన్నారు.
దేశీయ ఉపాధి మార్కెట్‌పై ఈ ప్రకటన సానుకూల ప్రభావాన్ని చూపనుంది. సమీప భవిష్యత్తులో నియామకాల పెరుగుదలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త కార్యాలయాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిందిగా కార్మికులను నితిన్ ఆహ్వానించారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు కస్టమర్లకు అద్భుతమైన విలువను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త కార్యాలయాలను స్థాపిస్తున్నట్లు స్పష్టం చేశారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications