బెంగళూరును దేశ రాజధాని చేయండి! ఢిల్లీ అమ్మాయి సెన్సేషనల్ కామెంట్స్.. నెట్టింట మొదలైన 'నార్త్ సౌత్' వార్!
భారతదేశానికి రాజధాని అనగానే మనకు గుర్తొచ్చేది ఢిల్లీ. కానీ, ఒక ఢిల్లీ అమ్మాయే ఇప్పుడు "మన దేశ రాజధానిని మార్చాల్సిన సమయం వచ్చింది.. బెంగళూరుకు ఆ అర్హత ఉంది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ డిస్కషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
సిమృద్ధి మఖిజా అనే యువతి.. ఇటీవల ఢిల్లీ నుండి బెంగళూరుకు మకాం మార్చింది. సుమారు రెండు నెలల పాటు బెంగళూరులో గడిపాక తిరిగి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆమెకు ఎదురైన అనుభవాలను ఒక వీడియో రూపంలో పంచుకుంది.

ఆమె దృష్టిలో బెంగళూరు ఎందుకు బెటర్?
సిమృద్ధి తన వీడియోలో బెంగళూరును సమర్థిస్తూ మూడు ముఖ్యమైన పాయింట్లను లేవనెత్తింది:
1. గాలి నాణ్యత (Air Quality): ఢిల్లీలో కాలుష్యం ఎంత భయంకరంగా ఉందో మనందరికీ తెలిసిందే. సిమృద్ధి ఢిల్లీని నేరుగా ఒక "గ్యాస్ ఛాంబర్" తో పోల్చింది. ఢిల్లీలో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిందని, బెంగళూరులో మాత్రం స్వచ్ఛమైన గాలి లభిస్తుందని ఆమె పేర్కొంది.
2. మహిళల రక్షణ (Safety): మహిళల భద్రత విషయంలో బెంగళూరు చాలా మెరుగ్గా ఉందని ఆమె అభిప్రాయపడింది. "రాత్రి 10 గంటల సమయంలో ఫ్రెండ్‌ని కలిసి ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వస్తున్నా.. ఇక్కడ నాకు ఎంతో సురక్షితంగా అనిపిస్తోంది. ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి ఊహించలేము" అని ఆమె చెప్పుకొచ్చింది.
3. మౌలిక సదుపాయాలు (Infrastructure): అంతర్జాతీయ అతిథులు మన దేశానికి వచ్చినప్పుడు వారికి కాలుష్యం, నడవడానికి వీలులేని రోడ్లు చూపించడం కంటే.. బెంగళూరు వంటి మెరుగైన నగరానికి ఆహ్వానించడం దేశ గౌరవానికి మంచిదని ఆమె సూచించింది. బెంగళూరు రోడ్లు పాదచారులకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని ఆమె తెలిపింది.
నెటిజన్ల మధ్య మొదలైన 'యుద్ధం'!
సిమృద్ధి వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకపక్క మద్దతుదారులు.. "నిజమే.. ఢిల్లీలో కాలుష్యం భరించలేనంతగా ఉంది. సౌత్ ఇండియా నగరాలు చాలా విషయాల్లో బెటర్" అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
మరోపక్క వ్యతిరేకించేవారు.. "బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు, నీటి ఎద్దడి గురించి మీకు తెలుసా? ఒక నగరం పాడైతే దాన్ని బాగు చేయాలి కానీ రాజధానిని మార్చమనడం తెలివైన పని కాదు" అని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు.
ఏది ఎమైనా ఈ చర్చ కేవలం రెండు నగరాల మధ్య పోటీ మాత్రమే కాదు.. మన మెట్రో నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యం, భద్రతా సమస్యలపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని తెలియజేస్తోంది. రాజధాని మార్పు అనేది అంత తేలికైన విషయం కాకపోయినా.. మన నగరాలను నివాస యోగ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి ఈ హాట్ డిస్కషన్ కాలుష్యం, భద్రత గురించిన పలు అంశాలను లేవనెత్తడమే కాకుండా దేశ రాజధానికి మార్పు అవసరం గురించి కూడా ఆలోచన రెకెత్తిస్తుంది.


Click it and Unblock the Notifications