ప్రధాని నరేంద్ర మోడీపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయకుండా నిరోధించాలని కోరుతూ నమోదైన పిటిషన్ పై ఢిల్లీలోని రోహిణీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ మేరకు బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC), వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇంటర్నెట్ ఆర్కైవ్‌లకు సమన్లు జారీ చేసింది. బినయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై అదనపు జిల్లా న్యాయమూర్తి రుచికా సింగ్లా ఆదేశాలు జారీచేశారు.
సమన్లు అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా లిఖిత పూర్వక వాంగ్మూలాన్ని దాఖలు చేయాలని కోర్టు ఆయా సంస్థలను ఆదేశించింది. మే 11న ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరగనుంది. సోషల్ మీడియా న్యాయవాది ముఖేష్ శర్మ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. అవమానకరంగా, పరువుకు భంగం కలిగేలా వ్యవహరించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పే విధంగా ఆదేశించాలని కోర్టు తలుపు తట్టారు. 10 లక్షల నష్టపరిహారాన్ని సైతం ఇప్పించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.

రెండు వాల్యూమ్‌ల డాక్యుమెంటరీ సిరీస్ "ఇండియా: ది మోడీ క్వశ్చన్" ప్రసారాన్ని నిలుపుదల చేయాలని పిటిషనర్ బినయ్ కుమార్ సింగ్ కోర్టుని కోరారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) కు సంబంధించిన ఏదైనా ఇతర పరువు నష్టం కలిగించే అంశాలను ప్రచురించకుండా చూడాలని విన్నవించారు. RSS మరియు విశ్వ హిందూ పరిషత్ (VHP) పరువుకు భంగం కలిగించకుండా.. వికీమీడియా, ఇంటర్నెట్ ఆర్కైవ్స్ లేదా ఇతర ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ప్లాట్ ఫారమ్‌లపై వ్యవహరించకుడా నియంత్రించాలని విఙప్తి చేశారు.
భారత ప్రధాని మోడీకి మరియు దేశంలోని ముస్లిం మైనారిటీలకు మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు BBC తన డాక్యుమెంటరీలో పేర్కొంది. ఈ క్రమంలో విద్వేషపూరిత నేరాలు, విపరీత రాజకీయాలు ద్వారా ఆందోళనలు ఎక్కువవుతున్నట్లు తెలిపింది. ముస్లిం సమాజం లక్ష్యంగా పలు వ్యూహాలు జరుగుతున్నాయని వెల్లడించింది. భారత్ ను హిందూ దేశంగా మార్చాలనే ఉద్ధేశంతో ముస్లిం మహిళలపై అత్యాచారాలు సహా హింసకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది.

BJP, RSS, VHPల పైనా BBC పలు ఆరోపణలు చేసింది. మత ఘర్షణల కారణంగా కనీసం 2 వేల మంది హత్యకు గురయ్యారని చెప్పింది. క్లెయిమ్‌ల ప్రామాణికతను ధృవీకరించకుండా వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన పుకార్లను ప్రచారం చేసిందని BBCపై ఆరోపణలు ఉన్నాయి. వీటివల్ల హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంపొందింది. దీంతో తన విశేష అధికారాలను ఉపయోగించి, చట్ట ప్రకారం డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేదించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications