ఢిల్లీ వాసులకు శుభవార్తను అందించింది ప్రభుత్వం. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో అమలు చేసిన పాత డీజిల్ వాహనాలపై ఇంధన నిషేధం నిర్ణయాన్ని ప్రభుత్వం పాక్షికంగా వెనక్కు తీసుకుంది. దీనితో వేలాది మంది వాహన యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఢిల్లీలో గాలి నాణ్యత బాగా తగ్గిపోతుండటంతో, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. దీంతో పాటుగా 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలపైనా ఈ నిషేధం వర్తించేలా కొత్త రూల్ తీసుకువచ్చింది.
ఈ కఠినమైన నిబంధనను 2025 నాటికి మరింత కఠినతరం చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడంతో.. వాహన యజమానులలో భయాందోళనలు మొదలయ్యాయి. చాలా మంది తమ పాత కార్లను తొందరపడి అమ్మేశారు. మరికొందరి కార్లు ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. అయితే ప్రజల నుంచి పెరుగుతున్న వ్యతిరేకత, సోషల్ మీడియా విమర్శల ఫలితంగా ప్రభుత్వం పాక్షికంగా నిబంధనను సడలించింది. దీంతో కొంతమంది తమ కార్లను తిరిగి పొందే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.

మీ కారును ప్రభుత్వం నుండి తిరిగి పొందే విధానం
1. ఢిల్లీ రవాణా శాఖ వెబ్‌సైట్ లేదా వాహన్ పోర్టల్ ఓపెన్ చేయండి.
2. మీ వాహనం నెంబర్ నమోదు చేసి, దాని స్థితిని తనిఖీ చేయండి.
3. మీ కారు స్వాధీనం చేసుకుని యార్డ్‌లో ఉన్నట్లయితే (వేలం కాని లేదా స్క్రాప్ కాని ఉంటే), దాని విడుదల కోసం దరఖాస్తు చేయవచ్చు.
4. దగ్గరలో ఉన్న RTO కార్యాలయంలో అభ్యర్థన దాఖలు చేయాలి.
5. అవసరమైన పార్కింగ్ ఛార్జీలు, యార్డ్ ఫీజులు చెల్లించాలి.
6. మీ కారు ఫిట్‌నెస్ టెస్ట్, ప్యూసీ (PUC) టెస్ట్ పూర్తి చేయాలి. వీటన్నింటిలో మీ కారు ఉత్తీర్ణత సాధిస్తే, మీరు దానిని తిరిగి పొందవచ్చు.
అయితే మీరు ఎంత త్వరగా మీ కారును తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే కొన్ని కార్లు ఇప్పటికే స్క్రాప్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని వాహనాలు రిజిస్ట్రేషన్ తొలగింపు జాబితాలోకి వెళ్లిపోయాయి. మీరు ఇప్పుడు మీ పాత కారును ఎవరికైనా అమ్ముకోవచ్చు. తాజా నిబంధనల ప్రకారం తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఇతర రాష్ట్రాలలో ఇలాంటి కఠినమైన నిబంధనలు లేనందున ఈ దిశగా కూడా మీరు ఆలోచన చేయవచ్చు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications