Hero Motocorp: పవన్ ముంజల్‌పై దిల్లీ పోలీసులు FIR.. కుప్పకూలిన స్టాక్..
Pawan Munjal: హీరో మోటార్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజల్ చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు సోదాలు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజాగా హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్‌పై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. FIR ప్రకారం ఐదుగురిపై ఫిర్యాదు నమోదు చేయబడినట్లు వెల్లడైంది. ముందుగా కంపెనీ హీరో మోటోకార్ప్, ఎగ్జిక్యూటివ్ పవన్ ముంజాల్ ఇందులో ఉన్నారు. అలాగే కంపెనీలోని అధికారులైన విక్రమ్ కస్బేకర్, హరి గుప్తా పేర్లు ఇందులో ఉన్నాయి. ఇక చివరగా 2009-10లో కంపెనీ కోసం డెలాయిట్ హాస్కెన్స్ & సెల్స్ భాగస్వామి ఆడిటర్‌గా పనిచేసిన మంజులా బెనర్జీ ఉన్నారు. బ్రెయిన్ లాజిస్టిక్స్ ఫిర్యాదుదారుగా వెల్లడైంది.

2019, 2020 పుస్తరాల్లో మోసపూరిత నెలవారీ బిల్లుల నమోదు ద్వారా రూ.5.95 కోట్లు విలువైన నకిలీ బిల్లులు తయారు చేసినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. హీరో మోటోకార్ప్‌తో దాని ఒప్పందం మార్చి 31, 2009న ముగిసిందని, అందువల్ల ఆ తేదీ తర్వాత వారికి డెబిట్‌లను క్లెయిమ్ చేసే అన్ని బిల్లులు తప్పుగా ఉన్నాయని బ్రెయిన్స్ లాజిస్టిక్స్ ఆరోపించింది.
ఈ వార్తల నేపథ్యంలో హీరో మోటార్స్ కంపెనీ షేర్లు ప్రభావితం అయ్యాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు షేరు మరింత క్షీణించి 2949.15 వద్ద మరో 3.10 పాయింట్లు తగ్గింది. ఎన్ఎస్ఈలో 3 గంటల సమయంలో 2.70 శాతం నష్టంతో రూ.2956.70 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. గతంలో మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు దిల్లీతో పాటు, గురుగ్రామ్‌లోని 69 ఏళ్ల బిలియనీర్ వ్యాపారవేత్త నివాస, వ్యాపార ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి.


Click it and Unblock the Notifications